IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్‌ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!

IPL Tournament : ప్రపంచంలోని అతిపెద్ద ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ టోర్నమెంట్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్..

IPL Tournament : ప్రపంచంలోని అతిపెద్ద ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ టోర్నమెంట్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చే ICC FTP (ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్) క్యాలెండర్‌లో ఐపీఎల్‌ను రెండున్నర నెలల వరకు పొడిగించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆటగాళ్లను పాల్గొనేందుకు వీలుగా 10 వారాల విండోను విస్తరించేందుకు ఐసీసీ సిద్ధంగా ఉంది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ఒక ప్రకటనలో వెల్లడించారు. రానున్న సీజన్‌లలో ఐపీఎల్ క్రికెట్‌ కాలవ్యవధి మరింత పెంచనున్నట్టు ధ్రువీకరించాడు. అయితే కొత్త ఫ్రాంచైజీలను తీసుకొచ్చే ఆలోచన లేదన్నాడు. ప్రస్తుతం ఉన్న జట్లతోనే మ్యాచ్‌ల సంఖ్యతో పాటు ఆటగాళ్ల సంఖ్యను పెంచనున్నట్టు తెలిపాడు.

2024-2031 ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌పై చర్చించేందుకు ఐసీసీ వచ్చే వారం సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో ఐపీఎల్‌ విండో విస్తరణపై పూర్తి క్లారిటీ రానుందని తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల సంఖ్య 8 నుంచి 10కి పెంచారు. అలాగే క్యాష్‌ రిచ్‌ లీగ్‌ 2 నెలల పాటు సాగాయి. ఐపీఎల్‌ 2022లో మ్యాచ్‌ల సంఖ్య 74కు పెరిగింది. రానున్న సీజన్‌లలో ఈ సంఖ్య 94కు పెరిగే అవకాశం ఉంది. 2024-2031 FTP క్యాలెండర్‌ను వచ్చే నెలలో పాలక ICC చర్చించే అవకాశం ఉంది.

Ipl To Get Two And A Half Month Window In Next Icc Ftp, Says Jay Shah 

మీడియా హక్కుల వేలం తర్వాత IPL మరింత విస్తరించింది. తద్వారా ప్రపంచంలోనే రెండవ అత్యంత ప్రతిష్టాత్మకమైన లీగ్‌గా అవతరించింది. ఐపీఎల్‌ను మరింత విస్తరించడం ద్వారా ప్రతిభ నాణ్యతలో రాజీ లేకుండా టాలెంట్ ను ప్రోత్సహించడం, అట్టడుగు వర్గాలను బలోపేతం చేయడం, సరైన మౌలిక సదుపాయాలను నిర్మించడం వంటి అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. BCCI అంతర్జాతీయ క్రికెట్‌కు కట్టుబడి ఉందన్నారు. ఇది కేవలం భారత్, ఇంగ్లాండ్ లేదా భారత్ v ఆస్ట్రేలియా వంటి మార్క్యూ సిరీస్ మాత్రమే కాదన్నారు. ప్రస్తుతం ఉన్న 74 గేమ్‌ల నుండి, 2027 నాటికి IPLని 94 గేమ్‌లకు విస్తరించాలని BCCI యోచిస్తోంది.

Read Also :  IPL : ఐపీఎల్‌ ఆట మాత్రమే కాదు కాసులు కురిపించే అక్షయపాత్ర..ఆక్షన్ ఏదైనా డబ్బులే డబ్బులు…

ట్రెండింగ్ వార్తలు