ఐపీఎల్ 2026 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉంది. అయినప్పటికి కూడా ఇప్పటి నుంచే ఫ్రాంఛైజీలు సిద్ధం అవుతున్నాయి. ఇక ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ట్రేడ్ విండో ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రేడ్ విండో ద్వారా రెండు జట్లు పరస్పర అంగీకారంతో ఆటగాళ్లు మార్పిడి చేసుకోవచ్చు.
ఈ క్రమంలో స్టార్ ఆటగాళ్ల కోసం పలు ఫ్రాంచైజీ పోటీలు పడుతున్నట్లు తెలుస్తోంది. అందులో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ సైతం ఉన్నట్లు సమాచారం. అతడిని సొంతం చేసుకునేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అతడికి ఐపీఎల్ 2026 సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతలను కూడా ఆఫర్ చేస్తున్నాయట.
ENG vs IND : సచిన్ టెండూల్కర్ ను అధిగమించిన సిరాజ్.. బ్యాటింగ్‌లో కాదండి బాబు.. బౌలింగ్‌లో..
ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 14 కోట్లకు కొనుగోలు చేసింది. ఓ బ్యాటర్‌గా ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ తరుపున ఆడిన రాహుల్ రాణించాడు. 13 ఇన్నింగ్స్ల్లో 539 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ రాహుల్ అదరగొడుతున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్ కోసం ఫ్రాంచైజీలు ఎంతైన వెచ్చించేందుకు సిద్ధం అయ్యాయని తెలుస్తోంది.
కెప్టెన్‌గా రాహుల్ ఇప్పటికే తాను ఏంటో నిరూపించుకున్నాడు. బ్యాటర్ గానే కాకుండా, వికెట్ కీపింగ్ కూడా చేయగల అతడి కోసం సీఎస్‌కే, కేకేఆర్‌లు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఢిల్లీ క్యాపిటల్స్ రాహుల్ ను వదులుకునేందుకు సిద్ధంగా ఉందా? లేదా? అన్న సంగతి తెలియాల్సి ఉంది.