ENG vs IND : సచిన్ టెండూల్కర్ ను అధిగమించిన సిరాజ్.. బ్యాటింగ్‌లో కాదండి బాబు.. బౌలింగ్‌లో..
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సంబంధించిన ఓ రికార్డును టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అధిగమించాడు

ENG vs IND Mohammed Siraj beats Sachin Tendulkar International wickets
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కు సంబంధించిన ఓ రికార్డును టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అధిగమించాడు. అయితే.. అది బ్యాటింగ్‌కు సంబంధించిన రికార్డు కాదండి బాబు.. బౌలింగ్‌కు సంబంధించినది.
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి వికెట్ల సంఖ్య 203కి చేరింది. ఇందులో టెస్టుల్లో 118, వన్డేల్లో 71, టీ20ల్లో 14 వికెట్లు ఉన్నాయి.
ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ బౌలింగ్‌లో తీసిన వికెట్ల సంఖ్యను సిరాజ్ దాటాడు. సచిన్ తన సుధీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 201 వికెట్లు సాధించాడు. టెస్టుల్లో 46, వన్డేల్లో 154, టీ20ల్లో ఓ వికెట్ పడగొట్టాడు.
ఇక ఐదో టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే.. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగలు చేయగా.. ఆ తరువాత ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌కు 23 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
PCB : డబ్ల్యూసీఎల్ ఎఫెక్ట్.. పీసీబీ సంచలన నిర్ణయం.. అక్కడ పాకిస్థాన్ పేరు బ్యాన్..
అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. క్రీజులో యశస్విజైస్వాల్ (51), ఆకాశ దీప్ (4) లు ఉన్నారు. ప్రస్తుతం భారత్ 52 పరుగుల ఆధిక్యంలో ఉంది.