PCB : డబ్ల్యూసీఎల్ ఎఫెక్ట్.. పీసీబీ సంచలన నిర్ణయం.. అక్కడ పాకిస్థాన్ పేరు బ్యాన్..
వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు కొట్టిన దెబ్బకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

WCL 2025 effect PCB Takes Stunning Decision
వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు కొట్టిన దెబ్బకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై ప్రైవేటు క్రికెట్ టోర్నీల్లో పాకిస్థాన్ పేరును వాడేందుకు ఉన్న అనుమతిని పీసీబీ రద్దు చేసింది. ఒకవేళ ఉపయోగించుకోవాలని అనుకుంటే మాత్రం పీసీబీ అనుమతి తప్పని సరి అని పేర్కొంది. పీసీబీకి మాత్రమే పాకిస్థాన్ పేరును వాడుకునే హక్కు ఉన్నట్లు వెల్లడించింది.
ఇంగ్లాండ్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్ జరుగుతుతోంది. ఈ టోర్నీలో లీగ్ దశలో పాటు కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆడేందుకు టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు నిరాకరించిన సంగతి తెలిసిందే.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో ఎలాంటి టోర్నీల్లోనూ మ్యాచ్‌లు ఆడకూడదని అభిమానుల నుంచి వచ్చిన విజ్ఞప్తితోనే టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో పాక్ క్రికెట్ బోర్డు అత్యవసరంగా సమావేశమైనట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ‘గురువారం జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఎన్నో విషయాలను చర్చించాం. ఇందులో డబ్ల్యూసీఎల్ టోర్నీ విషయం కూడా ఉంది. పాక్‌తో ఆడేందుకు టీమ్ఇండియా మాజీలు నిరాకరించారు. ఇక నుంచి భవిష్యత్తులో ఇలాంటి టోర్నీల్లో పాక్ పేరును వాడకూడదు. తప్పనిసరి అయితే పీసీబీ అనుమతి తీసుకోవాల్సిందే. లేకపోతే చట్టమైన చర్యలు తీసుకుంటాం.’ అని పీసీబీ వర్గాలు తెలిపినట్లు సదరు నివేదికలు తెలిపాయి.
ఇక డబ్ల్యూసీఎల్‌లో సెమీస్ మ్యాచ్‌లో భారత్ ఆడేందుకు నిరాకరించడంతో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. శనివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ క్రమంలో పీసీబీ ఆ జట్టుకు అనుమతి ఇచ్చింది.