ENG vs IND : ‘నీ తల దించుకో..’ ఔటై పెవిలియన్‌కు వెలుతున్న బెన్‌డకెట్ భుజం పై చేయి వేసి ఆకాశ్ దీప్.. వీడియో
బెన్ డకెట్‌ను ఔట్ చేశాక టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

ENG vs IND 5th test Akash Deep Send Off to Ben Duckett
మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను ఔట్ చేశాక టీమ్ఇండియా పేసర్ సిరాజ్ హద్దులు దాటి సంబరాలు చేసుకున్నాడు. దీంతో సిరాజ్‌కు జరిమానా పడిన సంగతి తెలిసిందే. తాజాగా అదే బ్యాటర్‌తో ఐదో టెస్టులో టీమ్ఇండియా మరో పేసర్ ఆకాశ్ దీప్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
ఆకాశ్ బంతిని ఫైన్‌లెగ్ వైపు రివర్స్ స్కూప్ చేయబోయిన డకెట్.. వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఆకాశ్ గాల్లోకి పంచ్‌లు విసిరి సంబురాలు చేసుకున్నాడు. ఆ వెంటనే పెవిలియన్‌కు వెలుతున్న డకెట్ భుజం పై చేయి వేసి అతడిని కొంతదూరం తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Jasprit Bumrah : బుమ్రా విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐదో టెస్టు మ్యాచ్ మధ్యలోనే..
ఆకాశ్ దీప్ అలా చేయడానికి ఓ కారణముంది?
టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయిన తరువాత ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రెండో రోజు ఆట తొలి సెషల్ ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ (43; 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో పేసర్ ఆకాశ్ దీప్‌ను ఉద్దేశించి డకెట్.. ‘ఇక్కడ నువ్వు నన్ను ఔట్ చేయలేవు.’ అని అన్నాడు. ఆ తరువాత ఆకాశ్ దీప్ బౌలింగ్‌లోనే రివర్స్ స్వీప్ షాట్‌తో సిక్స్ సైతం కొట్టాడు. అయినప్పటికి ఆకాశ్ ఏమీ అనలేదు.
ఆ తరువాత కాసేపటికి ఆకాశ్ దీప్ అద్భుతమైన బౌలింగ్‌తో డకెట్ ను ఇబ్బంది పెట్టాడు. చివరికి అతడిని ఔట్ చేశాడు. ఈ క్రమంలోనే పెవిలియన్‌కు వెలుతున్న డకెట్ భుజం పై చేయి వేసి మాట్లాడుతూ.. అతడిని డగౌట్‌కు సాగనంపాడు ఆకాశ్. ఈ సమయంలో డకెట్ కూడా చాలా సరదాగానే ఆకాశ్‌తో మాట్లాడాడు. ఈ వీడియో వైరల్ అవుతోండగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
Duckett to Akash: “You can’t get out here” — follows it up with a brilliant reverse sweep six.
Tried the same shot again… and got out to Akash Deep himself.
Karma swept back! 🌀🏏 #ENGvIND #Duckett #AkashDeep pic.twitter.com/gW1IOiRMCR— 24*7 and 360°™ (@247and36012839) August 1, 2025