Jasprit Bumrah : బుమ్రా విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐదో టెస్టు మ్యాచ్ మధ్యలోనే..
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.

BCCI takes big decision on Bumrah in middle of ENG vs IND 5th test
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగలు చేయగా, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 23 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. క్రీజులో యశస్విజైస్వాల్ (51), ఆకాశ దీప్ (4) లు ఉన్నారు.
ఇలా ఓ వైపు ఐదో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోండగా.. మరోవైపు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను జట్టు నుంచి విడుదల చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. జట్టు నుంచి విడుదల చేయడంతో బుమ్రా స్వదేశానికి రానున్నాడు.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రా ఐదో టెస్టుకు దూరం అయ్యాడు. ఈ మ్యాచ్‌తోనే సిరీస్ ముగియనుండడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
🚨 NEWS 🚨
Jasprit Bumrah released from squad for fifth Test.
Details 🔽 #TeamIndia | #ENGvINDhttps://t.co/nqyHlIp6fZ
— BCCI (@BCCI) August 1, 2025
కాగా.. గత కొంత కాలంగా ఈ పేస్ గుర్రం గాయాలతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని సిరీస్‌కు ముందే హెడ్ కోచ్ గంభీర్ స్పష్టత ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అతడు తొలి, మూడో, నాలుగో టెస్టు మ్యాచ్‌ల్లో ఆడాడు.
ఈ సిరీస్‌లో మొత్తం 14 వికెట్లు బుమ్రా తీశాడు. ఇక లార్డ్స్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో అతడు ప్రతిష్టాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో స్థానం సంపాధించాడు.