Ipl2022 Gt Vs Lsg
IPL2022 GT Vs LSG : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా నేడు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్(GT), లక్నో సూపర్ జెయింట్స్(LSJ) జట్లు తలపడుతున్నాయి. మంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. గుజరాత్ కు 159 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. లక్నో జట్టు ఆరంభంలో తడబడినా ఆ తర్వాత నిలబడింది. టాప్ ఆర్డర్‌లో కీలక ఆటగాళ్లు చేతులెత్తేసిన వేళ.. క్రీజ్‌లోకి వచ్చిన దీపక్ హుడా (55), ఆయుష్ బదోని (54) జట్టును గట్టెక్కించారు. పది ఓవర్లకు 47గా ఉన్న స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడంలో వారిద్దరిదే కీ రోల్.
లక్నో జట్టు బ్యాటర్లలో దీపక్ హుడా, ఆయుష్ బదోనీ హాఫ్ సెంచరీలతో రాణించారు. హుడా 41 బంతుల్లో 55 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. ఆయుష్ బదోని 41 బంతుల్లో 54 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. కృణాల్ పాండ్య 21 పరుగులు(నాటౌట్) చేశాడు. లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. డి కాక్ (7), మనీశ్ పాండే (6) నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. వరుణ్ ఆరోన్ రెండు వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.(IPL2022 GT Vs LSG)
IPL 2022: ధోనీతో పోటీ పడాలనుకుంటున్నా – హార్దిక్ పాండ్యా
ఇన్నింగ్స్ తొలి బంతికే కెప్టెన్ కేఎల్ రాహుల్ డకౌట్ కావడంతో లక్నో శిబిరం దిగ్భ్రాంతికి గురైంది. రాహుల్ ను ఔట్ చేసిన షమీ అదే ఊపులో డికాక్ (7), మనీష్ పాండే (6)లను కూడా ఔట్ చేయడంతో లక్నో జట్టు పీకలలోతు కష్టాల్లో పడింది. మరోవైపు వరుణ్ ఆరోన్ కూడా విజృంభించి ఎవిన్ లూయిస్ (10)ని పెవిలియన్ చేర్చాడు.
ఈ దశలో దీపక్ హుడా (55), ఆయుష్ బదోని (54) అద్భుతంగా ఆడారు. స్కోర్ బోర్డుని ముందుకు నడిపించారు. జట్టు స్కోరును 100 మార్కు దాటించారు. లక్నో జట్టు ఆ మాత్రం స్కోరు చేసిందంటే వీళ్లద్దరి చలవే. ఆఖర్లో కృనాల్ పాండ్యా (13 బంతుల్లో 21 నాటౌట్) ధాటిగా ఆడాడు.
ఐపీఎల్ 2022 సీజన్ 15-లో ఈసారి 10 జట్లు ఆడుతుండడం తెలిసిందే. కొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఎంట్రీ ఇచ్చాయి. కొత్త జట్లు, కొత్త సీజన్… తొలి విజయం ఎవరిదోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
IPL 2022 : రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా.. హిట్ మ్యాన్ చేసిన తప్పు ఇదే..!
కాగా, గుజరాత్ జట్టుకు హర్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా, లక్నో జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా గుర్తింపు పొందారు. అయితే మైదానంలో ప్రత్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఇకపోతే.. హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా లక్నో జట్టులో ఉన్నాడు.
భారత క్రికెట్ రంగంలో హార్దిక్, కృనాల్ పాండ్యా, కేఎల్ రాహుల్… ముగ్గురూ చాలాకాలంగా మిత్రులు. వీళ్లు ఎక్కడ ఉన్నా అక్కడ సందడి నెలకొంటుంది. సోషల్ మీడియాలో వీళ్ల దోస్తీకి సంబంధించి అనేక ఫొటోలు దర్శనమిస్తాయి.