IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. గుజరాత్‌ టైటాన్స్ పై ఘన విజయం సాధించింది.(IPL2022 Gujarat Vs RCB)

IPL2022 Gujarat Vs RCB : తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. గుజరాత్‌ టైటాన్స్ తో పోరులో అద్భుతంగా రాణించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్‌ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ అలవోకగా ఛేదించింది. 18.4 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది.

బెంగళూరు ఓపెనర్లు కోహ్లీ (73), డుప్లెసిస్‌ (44) అదిరే శుభారంభాన్ని అందించారు. తర్వాత మ్యాక్స్‌వెల్ (40*) ధాటిగా ఆడడంతో బెంగళూరు గెలుపొందింది. ఈ విజయంతో బెంగళూరు ప్లేఆప్స్‌ ఆశలు సజీవంగానే ఉన్నాయి.(IPL2022 Gujarat Vs RCB)

Musa Yamak : షాకింగ్.. గుండెపోటుతో రింగ్‌లోనే కన్నుమూసిన దిగ్గజ బాక్సర్.. ఇప్పటివరకు ఓటమన్నదే ఎరుగడు

ఈ మ్యాచ్ లో బెంగళూరు ఓపెనర్‌ విరాట్ కోహ్లీ (73) హాఫ్ సెంచరీతో మెరిశాడు. డుప్లెసిస్‌ (44) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు పెవిలియన్‌కు చేరినా.. బెంగళూరు విజయం సాధించిందంటే దానికి కారణం గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 40 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్. చివరి వరకు దూకుడుగా ఆడి బెంగళూరును గెలుపు తీరాలకు చేర్చాడు మ్యాక్స్ వెల్. దీంతో బెంగళూరు 18.4 ఓవర్లలో 170 పరుగులు చేసి విజయం సాధించింది. గుజరాత్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ 168/5 స్కోరు సాధించింది.

ఈ మ్యాచ్‌తో బెంగళూరు లీగ్‌ దశ ముగిసింది. 14 మ్యాచులు ఆడిన ఆర్సీబీ.. 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల టేబుల్ లో నాలుగో స్థానానికి ఎగబాకింది. అయితే ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ (14) తన ఆఖరి మ్యాచ్‌లో ముంబైపై ఓడితేనే అవకాశం ఉంటుంది. లేదంటే బెంగళూరు ఇంటిముఖం పట్టాల్సిందే.

ముంబైపై ఢిల్లీ విజయం సాధిస్తే నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా బెంగళూరు ఇంటిముఖం పట్టక తప్పదు. ఒకవేళ ఢిల్లీ ఓడితే మాత్రం బెంగళూరు ప్లేఆఫ్స్‌ వెళ్లినట్లే. మరోవైపు బెంగళూరు గెలవడంతో తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా పంజాబ్‌, హైదరాబాద్‌ ఇంటిముఖం పట్టాయి. కాగా, ఈ మ్యాచ్‌లో ఓడినా గుజరాత్‌కు నష్టమేమీ లేదు. 20 పాయింట్లతో అగ్రస్థానంతో లీగ్‌ దశను ముగించింది.

Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన గుజరాత్ బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ, రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ తో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది.

పాండ్యా 47 బంతుల్లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాండ్యా స్కోరులో 4 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. ఆఖర్లో వచ్చిన రషీద్ ఖాన్ చిచ్చరపిడుగులా చెలరేగడంతో గుజరాత్ స్కోరు 150 మార్కు దాటింది. రషీద్ ఖాన్ కేవలం 6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేశాడు.

అంతకుముందు, ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 31, డేవిడ్ మిల్లర్ 34 (3 సిక్సర్లు) పరుగులతో రాణించారు. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (1) విఫలం కాగా, మాథ్యూవేడ్ 16 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజెల్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాక్స్ వెల్, హసరంగ చెరో వికెట్ తీశారు.(IPL2022 Gujarat Vs RCB)

ట్రెండింగ్ వార్తలు