Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌ స్వర్ణపతకం గెలిచింది. ఫైన‌ల్‌లో జిట్ పాంగ్‌పై పంచ్‌ల వ‌ర్షం కురిపించిన నిఖ‌త్ లాస్ట్ పంచ్ కూడా త‌న‌దేన‌న్న‌ట్లుగా చెల‌రేగింది.

Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్

Nikhat Zareen

Nikhat Zareen : భారత యువ మహిళా బాక్సర్, తెలంగాణకు చెందిన నిఖ‌త్ జ‌రీన్ చ‌రిత్ర సృష్టించింది. మ‌హిళ‌ల ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. గురువారం రాత్రి జరిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో నిఖ‌త్ ఘన విజ‌యం సాధించింది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ను చిత్తు చేసిన నిఖ‌త్.. ఉమెన్స్ వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా నిలిచింది.

Boxer Nikhat Zareen: గోల్డ్ మెడల్ పై నిఖత్ గురి: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తెలంగాణ అమ్మాయి

ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌ స్వర్ణపతకం గెలిచింది. 52 కిలోల విభాగంలో ఫైనల్‌లో జిట్‌పాంగ్ (థాయ్‌లాండ్‌)పై 5-0 తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది.

Musa Yamak : షాకింగ్.. గుండెపోటుతో రింగ్‌లోనే కన్నుమూసిన దిగ్గజ బాక్సర్.. ఇప్పటివరకు ఓటమన్నదే ఎరుగడు

బౌట్‌ ఆరంభం నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. రింగ్‌లో దూకుడుగా కదిలిన నిఖత్.. ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ప్రత్యర్థిపై పంచ్ లతో విరుచుకుపడింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఐదో బాక్సర్‌గా రికార్డు సృష్టించింది నిఖత్. అంతకుముందు మేరీ కోమ్‌, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ కేసీ మాత్రమే గోల్డ్‌ మెడల్‌ను సాధించారు.(Nikhat Zareen)

Nikhat Zareen (1)

Nikhat Zareen (1)

సెమీస్ ఫైనల్ లో నిఖత్ 5-0తో కరోలిన్ డి అల్మీడా (బ్రెజిల్)పై గెలుపొందగా… జిట్‌పాంగ్ 4-1తో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత జైనా షెకర్‌బెకోవా (కజకిస్తాన్)ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.

25 ఏళ్ల నిఖత్ జరీన్ నిజామాబాద్‌ వాసి. చిన్నప్పటి నుంచే బాక్సింగ్‌లో సత్తా చాటుతున్న నిఖత్… జూనియర్ కేటగిరీలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. 2011లో టర్కీలో జరిగిన జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 50 కేజీల విభాగంలో తలపడిన ఆమె పసిడి పతకాన్ని నెగ్గి వరల్డ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. భారత్‌ నుంచి ఇప్పటివరకు మేరీకోమ్ ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలవగా… సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్, లేఖ మహిళా ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు. తాజాగా ఈ జాబితాలో నిఖత్ కూడా చోటు దక్కించుకుంది.

Nikhat Zareen

Nikhat Zareen

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో పుట్టి పెరిగిన నిఖత్ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. నిఖత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ తన కుమార్తెను బాక్సింగ్‌లో ప్రోత్సహించి స్వయంగా తనే ఒక ఏడాది పాటూ శిక్షణ ఇచ్చారు. తరువాత 2009లో విశాఖపట్నానికి చెందిన ద్రోణాచార్య అవార్డీ ఐవీ రావు దగ్గర ఆమె శిక్షణ పొందింది. అప్పటి నుంచి ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడుతూ వచ్చింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టార్గెట్ ఒలంపిక్ పోడియం స్కీమ్‌కి ఎంపిక అయింది. అడిడాస్‌కు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తోంది. హైదరాబాద్ ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతోంది.

Nikhat Zareen (3)

Nikhat Zareen (3)

2011లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన అంతర్జాతీయ విమెన్స్ యూత్ అండ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలవడం ఆమె కెరీర్‌లో తొలి పెద్ద అడుగు. ఆ తర్వాత నుంచి ఆమె ప్రదర్శన మెరుగవుతూనే వచ్చింది. మహిళల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు ముందు ఫిబ్రవరిలో జరిగిన 73వ స్ట్రాండ్‌జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంటు సెమీస్‌లో టోక్యో ఒలంపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ బూస్ నాజ్ ని ఓడించింది. ఆ టోర్నీలో స్వర్ణాన్ని సాధించింది.

నిఖత్ సాధించిన పతకాలు

2011: జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం

2018: బెల్‌గ్రేడ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి

2018: హరియాణాలో జరిగిన మహిళల సీనియర్ జాతీయ చాంపియన్‌షిప్‌లో కాంస్యం

2019: ఇండియా ఓపెన్‌లో కాంస్యం

2019: ఆసియా చాంపియన్‌షిప్ (థాయ్‌లాండ్)‌లో రజతం

2019: థాయ్‌లాండ్ ఓపెన్‌లో రజతం

2019: 70వ ఎడిషన్ స్ట్రాండ్‌జా బాక్సింగ్ టోర్నమెంట్‌ (బల్గేరియా)లో స్వర్ణం

2021: ఇస్తాంబుల్ టోర్నమెంట్‌లో కాంస్యం

2022: 73వ ఎడిషన్ స్ట్రాండ్‌జా బాక్సింగ్ టోర్నీ (బల్గేరియా) లో స్వర్ణం

ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్‎కు శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడావేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‎ను సీఎం కేసీఆర్ అభినందించారు.

Nikhat (1)

Nikhat (1)

ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వవిజేతగా నిలవడం గర్వించదగిన విషయమని సీఎం అన్నారు. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని, తెలంగాణలోని ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు.

Nikhat

Nikhat

కాగా, నిజామాబాద్‌ నుంచి వచ్చిన నిఖత్‌ జరీన్‌.. ప్రపంచ స్థాయిలో తలపడి గోల్డ్ మెడల్ సాధించేందుకు పడిన కష్టం అంతా ఇంతాకాదు. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో ఇబ్బందులు, అవహేళనలను ఎదుర్కొంది. 2020 ఒలింపిక్స్‌ ముందు సెలక్షన్స్‌లో వివాదం ఆమెను ఇబ్బంది పెట్టినా.. కుంగిపోలేదు. తానేంటో అందరికీ రుజువు చేయాలనే కసితో కష్ట పడి బరిలోకి దిగిన జరీన్‌ తన ఆటతోనే అందరికీ సమాధానం చెప్పింది.