Boxer Nikhat Zareen: గోల్డ్ మెడల్ పై నిఖత్ గురి: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తెలంగాణ అమ్మాయి

సెమీఫైనల్ బౌట్‌లో బ్రెజిల్‌కు చెందిన కరోలిన్ డి అల్మెడాను 5-0తో సునాయాసంగా ఓడించిన నిఖత్ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుని తన జోరును కొనసాగించింది

Boxer Nikhat Zareen: గోల్డ్ మెడల్ పై నిఖత్ గురి: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తెలంగాణ అమ్మాయి

Nikhat

Boxer Nikhat Zareen: తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి ప్రపంచ బాక్సింగ్ వేదికపై సత్తా చాటారు. బుధవారం ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుని తన జోరును కొనసాగించింది నిఖత్. సెమీఫైనల్ బౌట్‌లో బ్రెజిల్‌కు చెందిన కరోలిన్ డి అల్మెడాను 5-0తో సునాయాసంగా ఓడించిన నిఖత్..తన తొలి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా అత్యుత్తమ దూకుడు ప్రదర్శిస్తుంది. గురువారం జరిగే ఫైనల్లో నిఖత్ జరీన్ థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్ జుటామాస్‌తో తలపడనుంది. జూనియర్స్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన భారత బాక్సర్ నిఖత్, ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి భారత్ కు వస్తానని ధీమా వ్యక్తం చేసింది.

Other Stories:VVS Laxman: ద్రవిడ్ స్థానంలో కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్: ఐర్లాండ్ టీ20 సిరీస్ కోసం

ఇదే ఫార్మాట్ లో తలపడ్డ ఇతర భారత బాక్సర్లు మనీషా, పర్వీన్‌లు కాంస్యంతో సరిపెట్టుకున్నారు. సెమి ఫైనల్ అనంతరం నిఖత్ తన అట గురించి మాట్లాడుతూ “ఈ రోజు నా వ్యూహం ఏమిటంటే, ప్రత్యర్థి తన సహజమైన ప్రదర్శనను అడ్డుకుని..బదులుగా, నా ఆటకు ఆమెను సర్దుబాటు చేయడం. వ్యూహాన్ని విజయవంతంగా అనుసరించాను. స్వర్ణ పతకంతో స్వదేశానికి తిరిగి వస్తాను” అని నిఖత్ జరీన్ తెలిపింది. కాగా ఇప్పటికే సీనియర్ విభాగంలో ప్రపంచ మహిళా బాక్సింగ్ టైటిల్‌ను గెలుచుకున్న భారతీయ మహిళా బాక్సర్లు MC మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ RL మరియు లేఖ సీ వంటి ఉన్నత జాబితాలో నిఖత్ జరీన్ చేరే అవకాశం లేదు.