IPL2022 KKR Vs RCB : బెంగళూరు బౌలర్ల విజృంభణ.. కోల్‌కతా 128 ఆలౌట్

బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ కోల్‌కతా బ్యాటర్లను కట్టడి చేశారు. 128 ప‌రుగుల‌కే కోల్ కతా కుప్పకూలింది.

IPL2022 KKR Vs RCB : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. దీంతో కోల్‌కతా 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బెంగళూరు ముందు 129 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

కోల్‌కతా బ్యాటర్లలో ఆండ్రూ రసెల్‌ (25) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో వచ్చిన ఉమేశ్ యాదవ్‌ (18) పరుగులు చేశాడు. ఓపెనర్లు అజింక్య రహానె (9), వెంకటేశ్ అయ్యర్‌ (10), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ (13), నితీశ్ రాణా (10), సునీల్ నరైన్ (12), సామ్ బిల్లింగ్స్‌ (14), షెల్డన్ జాక్సన్‌ (0) డకౌట్ కాగా, టిమ్ సౌథీ (1) పరుగు చేశాడు. వరుణ్‌ చక్రవర్తి (10) నాటౌట్‌గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో వనిందు హసరంగ 4 వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. హర్షల్ పటేల్‌ రెండు, మహమ్మద్‌ సిరాజ్‌ ఒక వికెట్ తీశారు.(IPL2022 KKR Vs RCB)

IPL 2022 Season 15 : టీమిండియాకు ఆడదగ్గ ప్లేయర్ అంటూ రవిశాస్త్రి కామెంట్లు

బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ కోల్‌కతా బ్యాటర్లను కట్టడి చేశారు. కోల్ క‌తా బ్యాట‌ర్లు వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. దీంతో పూర్తి స్థాయి ఓవ‌ర్లు ఆడ‌కుండానే 18.5 ఓవ‌ర్లలోనే కోల్ క‌తా త‌న ఇన్నింగ్స్‌ను 128 ప‌రుగుల‌కే ముగించేసింది. టాస్ గెలిచిన బెంగళూరు జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుని కోల్ క‌తాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బెంగ‌ళూరు బౌల‌ర్లు కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌ను ఏమాత్రం కుదురుకోనివ్వలేదు.

ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నైని.. కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడించింది. మరోవైపు, పంజాబ్‌తో జరిగిన గత మ్యాచులో బెంగళూరు భారీ స్కోరు నమోదు చేసినా ఓటమి తప్పలేదు. ఈ మ్యాచులోనైనా గెలుపు బాట పడుతుందేమో చూడాలి.(IPL2022 KKR Vs RCB)

Legendary Cricketer Chris Gayle : టీ20 లెజెండ్ క్రిస్ గేల్.. విల్ బి బ్యాక్.. ఐపీఎల్‌లో రీఎంట్రీ..!

ఐపీఎల్ 15వ సీజన్ శనివారం (మార్చి 26, 2022) నుంచి ప్రారంభమైంది. గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తొలి పోరులో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించింది. ఈసారి ఐపీఎల్ పోటీలు ముంబై, పుణె నగరాల్లోనే నిర్వహిస్తున్నారు.

ఈసారి ఐపీఎల్ లో అహ్మదాబాద్ (గుజరాత్ టైటాన్స్), లక్నో (లక్నో సూపర్ జెయింట్స్) జట్లు కూడా ఆడుతుండగా, ఫ్రాంచైజీల సంఖ్య 10కి పెరిగింది. గుజరాత్ జట్టుకు హర్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా, లక్నో జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్లన్నింటికీ ముంబైలోని వివిధ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అయితే, ముంబైలో క్రికెట్ మైదానాలకు, ఆటగాళ్లు బస చేస్తున్న హోటళ్లు చాలా దూరంలో ఉన్నాయి. దాంతో, ఆటగాళ్లను మైదానానికి తరలించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేశారు.

IPL 2022 Rajasthan Vs Hyderabad : తీరు మారని సన్ రైజర్స్ హైదరాబాద్‌.. రాజస్తాన్ రాయల్స్ చేతిలో చిత్తు

ట్రెండింగ్ వార్తలు