IPL 2022: టీమిండియాకు ఆడదగ్గ ప్లేయర్ అంటూ రవిశాస్త్రి కామెంట్లు

టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి యంగ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పై కీలక కామెంట్లు చేశారు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఫాస్ట్ బౌలర్ ప్రదర్శన పట్ల ఇంప్రెస్ అయిపోయిన రవి..

IPL 2022: టీమిండియాకు ఆడదగ్గ ప్లేయర్ అంటూ రవిశాస్త్రి కామెంట్లు

Ravi Shastri

IPL 2022: టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి యంగ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పై కీలక కామెంట్లు చేశారు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఫాస్ట్ బౌలర్ ప్రదర్శన పట్ల ఇంప్రెస్ అయిపోయిన రవి.. తెగపొగిడేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఇది మంచి రోజు కాకపోయినా ఉమ్రాన్ మాలిక్.. మెరిశాడు. 2/39 స్కోరుతో సత్తా చాటాడు. అతణ్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని పిలుపునిచ్చాడు రవిశాస్త్రి.

‘ఇతనికి చాలా టాలెంట్ ఉందనిపిస్తుంది. ఒరిజినల్ పేస్ తో.. బ్యాట్స్‌మన్‌ను తికమక పెట్టిస్తున్నాడు. సరిగ్గా వాడటమే అసలు విషయం. అతనితో కమ్యూనికేట్ అయ్యే పద్ధతి, ఇచ్చే విలువైన సమాచారమే చాలా ముఖ్యం. అతని సత్తాపై ఎటువంటి సందేహం లేదు. ఇతను ఇండియాకు ఆడదగ్గ వ్యక్తి. దానికి అతను సిద్ధమైనప్పుడు.. సమయమే అవకాశం ఇస్తుంది’ అని రవిశాస్త్రి అభివర్ణించారు.

ముందుగా అతణ్ని నెట్ బౌలర్ కింద తీసుకుంటే.. టీమ్ కల్చర్ అలవాటవుతుందని చెప్పుకొచ్చాడు.

Read Also: రవిశాస్త్రి ఏజ్ ఎంత..120 ఏళ్లా ? గూగుల్ ఆన్సర్!

ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉండాల్సిన వ్యక్తి. ఇండియా ఏ టీంలోకి సెలక్టర్లు తీసుకుంటే బెటర్.. కొవిడ్ సమయంలో ఇలాంటి ఫాస్ట్ బౌలర్లను ఎంచుకోవడం వల్ల ఎక్కువమంది ఉండి హెల్ప్ అవుతారని రవి శాస్త్రి కాంప్లిమెంట్ ఇచ్చారు.