IPL2022 RR Vs SRH : తీరు మారని హైదరాబాద్‌.. రాజస్తాన్ చేతిలో చిత్తు

ఐపీఎల్ సీజన్ మారినా హైదరాబాద్ తీరు మాత్రం మారలేదు. మరోసారి అదే వైఫల్యం. ఫలితంగా రాజస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది.(IPL2022 RR Vs SRH)

IPL2022 RR Vs SRH : తీరు మారని హైదరాబాద్‌.. రాజస్తాన్ చేతిలో చిత్తు

Ipl2022 Rr Vs Srh

IPL2022 RR Vs SRH : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా మంగళవారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ సీజన్ లోనూ హైదరాబాద్ తీరు మారలేదు. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లోనూ విఫలమైంది. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ జట్టు హైదరాబాద్ ని చిత్తు చేసింది. 61 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు దంచికొట్టింది. భారీ స్కోర్ నమోదు చేసింది. డబుల్ సెంచరీ మార్క్ అందుకుంది. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. 61 రన్స్ తేడాతో రాజస్తాన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. హైదరాబాద్ బ్యాటర్లలో మార్‌క్రమ్‌ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. మరో ఎండ్ లో అతడికి సహకరించే వారు కరువయ్యారు.(IPL2022 RR Vs SRH)

మార్ క్రమ్ 41 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 14 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 2 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. రొమారియో షెపర్డ్ 18 బంతుల్లో 24 పరుగులతో పర్లేదనిపించాడు. కెప్టెన్ కేన్ విలియమ్ సన్(7), అభిషేక్‌ శర్మ (9), రాహుల్‌ త్రిపాఠి (0), నికోలస్ పూరన్‌ (0), అబ్దుల్ సమద్‌ (4) దారుణంగా విఫలయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌ మూడు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ తలో రెండు వికెట్లు పడగొట్టారు.(IPL2022 RR Vs SRH)

IPL 2022: దిగ్గజ కెప్టెన్ నుంచి సంజూ శాంసన్‌కు కీపింగ్ టిప్స్

రాజస్తాన్ రాయల్స్ తో పోరులో సన్ రైజర్స్ బౌలర్లు తేలిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ బ్యాటర్లు.. సన్ రైజర్స్ బౌలింగ్ ను ఊచకోత కోశారు. ప్రతి ఒక్కరు పోటీలు పడి సిక్సులు, ఫోర్లు బాదారు. ఫలితంగా.. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఓపెనర్ జోస్ బట్లర్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 20 పరుగులు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 55 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు.. హెట్ మైర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు.

సన్ రైజర్స్ బౌలర్లు అనేక నోబాల్స్ వేశారు. రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ ప్రతి ఒక్కరూ దూకుడుగా ఆడేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ వికెట్ తీశారు.

ఐపీఎల్ 15వ సీజన్ శనివారం (మార్చి 26, 2022) నుంచి ప్రారంభమైంది. గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తొలి పోరులో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించింది. ఈసారి ఐపీఎల్ పోటీలు ముంబై, పుణె నగరాల్లోనే నిర్వహిస్తున్నారు.

IPL2022 LSJ Vs GJ : రెచ్చిపోయిన రాహుల్ తెవాటియా.. లక్నోపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ

ఈసారి ఐపీఎల్ లో అహ్మదాబాద్ (గుజరాత్ టైటాన్స్), లక్నో (లక్నో సూపర్ జెయింట్స్) జట్లు కూడా ఆడుతుండగా, ఫ్రాంచైజీల సంఖ్య 10కి పెరిగింది. గుజరాత్ జట్టుకు హర్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా, లక్నో జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్లన్నింటికీ ముంబైలోని వివిధ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అయితే, ముంబైలో క్రికెట్ మైదానాలకు, ఆటగాళ్లు బస చేస్తున్న హోటళ్లు చాలా దూరంలో ఉన్నాయి. దాంతో, ఆటగాళ్లను మైదానానికి తరలించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేశారు.