IPL2022 Kolkata Vs SRH : కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ విఫలం.. వరుసగా 5వ ఓటమి

కీలకమైన మ్యాచ్ లో హైదరాబాద్ చేతులెత్తేయగా, కోల్ కతా అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో హైదరాబాద్ పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.(IPL2022 Kolkata Vs SRH)

IPL2022 Kolkata Vs SRH : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. కీలకమైన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ చేతులెత్తేయగా, కోల్ కతా అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో హైదరాబాద్ పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లో చెలరేగిన ఆండ్రూ రస్సెల్, బౌలింగ్ లోనూ విజృంభించాడు. 22 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసి కోల్ కతా విజయంలో కీ రోల్ ప్లే చేశాడు.

IPL 2022: ఫాస్టెస్ట్ 2వేల పరుగులు నమోదు చేసిన రస్సెల్

కోల్ కతా నిర్దేశించిన 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 123 పరుగులకే పరిమితమైంది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగుల మాత్రమే చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్కడే రాణించాడు. శర్మ 28 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఎయిడెన్ మార్ క్రమ్ 25 బంతుల్లో 35 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు.(IPL2022 Kolkata Vs SRH)

Andre Russell

కీలకమైన మ్యాచ్‌లో హైదరాబాద్‌ టాప్‌ ఆర్డర్‌లోని బ్యాటర్లు టెస్టు ఆటను తలపించారు. కోల్ కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ మూడు వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు.

IPL 2022: సీఎస్కేకు కెప్టెన్‌గా ఆ యువ క్రికెటర్ కరెక్ట్ అంటోన్న సెహ్వాగ్

హైదరాబాద్‌ కు ఇది వరుసగా ఐదో ఓటమి. దీంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. హైదరాబాద్‌పై ఘన విజయం సాధించిన కోల్‌కతా టెక్నికల్ గా ఛాన్స్‌లను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం 12 మ్యాచుల్లో హైదరాబాద్‌ ఐదు విజయాలతో 10 పాయింట్లను మాత్రమే సాధించింది. ఇక కోల్‌కతా 13 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి ఆరో స్థానానికి చేరుకుంది. ఈ ఓటమితో హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది.

పుణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డా చివ‌రికి చాలెంజింగ్ స్కోరే చేశారు. తొలుత వికెట్లు వ‌రుస‌గా ప‌డిన నేప‌థ్యంలో స్వ‌ల్ప స్కోరుకే చాప చుట్టేస్తుంద‌ని భావించిన కోల్ క‌తాను.. ఆల్ రౌండర్ ఆండ్రూ ర‌స్సెల్ (49) ఆదుకున్నాడు.

ఐదో నెంబరులో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ర‌స్సెల్ 28 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో వీర విహారం చేశాడు. ఇక సామ్ బిల్లింగ్స్ (34), రహానే (28), నితీష్ రానా (26) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కోల్ క‌తా 6 వికెట్ల‌ను కోల్పోయి 177 ప‌రుగులు చేసింది. హైదరాబాద్ బౌల‌ర్లలో స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు పడగొట్టాడు. భువ‌నేశ్వ‌ర్‌, న‌ట‌రాజ‌న్‌, మార్కో జాన్స‌న్ త‌లో వికెట్ తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు