IPL 2022: సీఎస్కేకు కెప్టెన్‌గా ఆ యువక్రికెటర్ కరెక్ట్ అంటోన్న సెహ్వాగ్

వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలనే ఆశలు గాలికొదిలేయాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 97 పరుగులకు ఆలౌట్ అవడంతో ముంబై ఇండియన్స్ సునాయాస విజయాన్ని నమోదు చేసింది.

IPL 2022: సీఎస్కేకు కెప్టెన్‌గా ఆ యువక్రికెటర్ కరెక్ట్ అంటోన్న సెహ్వాగ్

Virender Sehwag

 

 

IPL 2022: వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలనే ఆశలు గాలికొదిలేయాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 97 పరుగులకు ఆలౌట్ అవడంతో ముంబై ఇండియన్స్ సునాయాస విజయాన్ని నమోదు చేసింది.

చివరి రెండు లీగ్ దశల గేమ్‌లను CSK ఎలా ముగిస్తుందో చూడటం ఆసక్తికరంగా మారింది. ధోని వచ్చే సీజన్‌లో CSK కెప్టెన్‌గా తిరిగి వస్తాడా లేదా అనేది కూడా చూడాలి. ఇదిలా ఉంటే, సీఎస్కే రెగ్యూలర్ కెప్టెన్ గా చాలా కాలం కొనసాగే వ్యక్తి పేరు చెప్తున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.

రుతురాజ్ గైక్వాడ్ మంచి నాయకుడిగా గ్లింప్స్ చూపించాడని, CSKని ముందుకు నడిపించగలడని భారత మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు .

Read Also : ఇలా ఆడితే ఎప్పటికీ సాధించలేవు.. రిషబ్ పంత్‌కు సెహ్వాగ్ వార్నింగ్..!

“మహారాష్ట్రకు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ ప్రవర్తనలో చాలా కూల్‌గా ఉంటాడు. 100 స్కోర్ చేసినా, అంత స్కోర్ చేసినట్లు ప్రవర్తనలో కనిపించదు. సున్నా స్కోర్ చేసినా, ప్రవర్తన ఒకేలా ఉంటుంది. మంచి కెప్టెన్‌గా ఉండే అన్ని లక్షణాలను చూపించాడు” అని ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

“ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కెప్టెన్‌గా ఉన్నాడు. ఆటను ఎలా నియంత్రించాలనే ఆలోచన అతనికి ఉంది. 3-4 సీజన్‌లు ఆడిన తర్వాత ధోని తర్వాత దీర్ఘకాలిక కెప్టెన్‌గా మారగలడు. . ఇది నా అభిప్రాయం. MS ధోనీ చాలా కూల్‌గా ఉంటాడు. స్వంత నిర్ణయాలు తీసుకుంటాడు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి, రుతురాజ్ గైక్వాడ్‌లో అన్ని లక్షణాలు ఉన్నాయని అనుకుంటున్నా. MS ధోనిలో ఉన్న అన్ని ఇతర లక్షణాలు అతనికి ఉన్నాయి” అని వెల్లడించాడు.