IPL 2022 : ఇలా ఆడితే ఎప్పటికీ సాధించలేవు.. రిషబ్ పంత్‌కు సెహ్వాగ్ వార్నింగ్..!
IPL 2022 : ఐపీఎల్ టోర్నీలో ఎప్పుడూ దూకుడుగా ఆడే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఈసారి చల్లబడ్డాడు. అతడిలో ఒకప్పటి పవర్ లేదని.. అదే కొనసాగితే సక్సెస్ సాధించలేవని సెహ్వాగ్ సూచించాడు.

Won't Be Successful Virender Sehwag's Warning To Rishabh Pant
IPL 2022 : ఐపీఎల్ టోర్నీలో ఎప్పుడూ దూకుడుగా ఆడే రిషబ్ పంత్ ఈసారి చల్లబడ్డాడు. అతడిలో ఒకప్పటి పవర్ లేదని.. అదే కొనసాగితే ఎప్పటికీ సక్సెస్ సాధించలేవని ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌కు మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్ 2021 సీజన్ మాదిరిగా తన కెప్టెన్సీలోనూ దూకుడుగా కనిపించిన పంత్.. ఈ ఏడాది తన కెప్టెన్సీలో ఆ దూకుడు కనిపించడం లేదని సెహ్వాగ్ అన్నాడు.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. వరుసగా తర్వాతి రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్.. కేవలం 149 పరుగులకే చేతులేత్తేసింది. రిషబ్ పంత్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు నమోదు చేశాడు.
పృథ్వీషా ఇన్నింగ్స్ సాయంతో 7 ఓవర్లలో 67 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. డేవిడ్ వార్నర్, పావెల్ వికెట్లు వెనువెంటనే కోల్పోయింది. అప్పటికే టీంలో 7 వికెట్లు ఉండి కూడా పంత్ సేన భారీ స్కోరు సాధించలేకపోయింది. రిషబ్ పంత్ క్రీజులో నిలకడగా ఆడేందుకు ఎక్కువ సమయం తీసుకోవడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించలేకపోయింది. 19 బంతుల్లో 9 పరుగులు మాత్రమే పంత్ చేశాడు.
17 బంతుల్లో 30 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ ఆటతీరుపై స్పందించిన సెహ్వాగ్.. టెస్టులు లేదా ODIలు లేదా T20లలో అలానే ఆడాడు.. ఇంతకు ముందు అలానే బ్యాటింగ్ చేశాడు. అతను ఒకప్పటిలా ఎలా ఆడతాడో చూడాలి. కొన్నిసార్లు అది మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని సెహ్వాగ్ పంత్‌కు సూచించాడు. IPL 2022లో ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పటి వరకు ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. వచ్చే ఆదివారం మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ తలపడనుంది.
Read Also : IPL 2022: కోహ్లీని అవుట్ చేసిన చాహల్.. ట్విట్టర్లో మీమ్స్ వెల్లువ