IPL2022 MI Vs RCB : సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ.. బెంగళూరు టార్గెట్ 152

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేసింది. బెంగళూరు జట్టుకి 152..

Ipl2022 Mi Vs Rcb

IPL2022 MI Vs RCB : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేసింది. బెంగళూరు జట్టుకి 152 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 37 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 సిక్సులు, 5ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్లు ఇషాన్ కిషన్‌ (26), రోహిత్‌ శర్మ (26) రాణించినా.. తర్వాత వచ్చిన వాళ్లెవరూ నిలబడలేకపోయారు. చివర్లో సూర్యకుమార్‌ (68*) ధాటిగా ఆడాడు. హాఫ్‌ సెంచరీ బాదాడు.

బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ముంబై ప్లేయర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్‌ రోహిత్ శర్మ (26), ఇషాన్‌ కిషన్‌ (26) ముంబైకి శుభారంభాన్ని ఇచ్చారు. అయితే, డెవాల్డ్ బ్రెవిస్‌ (8), రమణ్‌ దీప్‌ సింగ్‌ (6) విఫలమయ్యారు. తిలక్‌ వర్మ (0), కీరన్‌ పొలార్డ్‌ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. జయదేవ్‌ ఉనద్కత్ (13*) పరుగులు చేశాడు. బెంగుళూరు బౌలర్లలో హసరంగ, హర్షల్‌ పటేల్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆకాశ్‌ దీప్‌ ఒక వికెట్‌ తీశాడు.(IPL2022 MI Vs RCB)

IPL 2022 : ఇలా ఆడితే ఎప్పటికీ సాధించలేవు.. రిషబ్ పంత్‌కు సెహ్వాగ్ వార్నింగ్..!

ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్ జట్టు.. ఎలాగైనా పాయింట్ల ఖాతా ఓపెన్‌ చేయాలని ఆశిస్తోంది. ముంబై తొలిసారిగా కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. జట్టులో నలుగురు సభ్యుల వరకు విదేశీయులకు అవకాశం ఉంది. మరోవైపు రెండు విజయాలు, ఒక ఓటమితో నాలుగు పాయింట్లు సాధించిన బెంగళూరు మరో గెలుపుతో టాప్‌-4లోకి వెళ్లేందుకు తహతహలాడుతోంది.

జట్ల వివరాలు :
ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్‌), డెవాల్డ్‌ బ్రెవిస్, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, రమణ్ దీప్‌ సింగ్, మురుగన్‌ అశ్విన్, జయ్‌దేవ్ ఉనద్కత్, జస్ప్రీత్‌ బుమ్రా, బాసిల్ థంపి

బెంగళూరు: డు ప్లెసిస్‌ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్‌ కార్తిక్, డేవిడ్ విల్లే, వనిందు హసరంగ, సిరాజ్‌, ఆకాశ్ దీప్, హర్షల్ పటేల్(IPL2022 MI Vs RCB)

IPL 2022: కోహ్లీని అవుట్ చేసిన చాహల్.. ట్విట్టర్లో మీమ్స్ వెల్లువ