IPL2022 PBKS Vs RCB : దంచికొట్టిన డుప్లెసిస్.. బెంగళూరు డబుల్ సెంచరీ.. పంజాబ్ ముందు బిగ్ టార్గెట్

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 205 పరుగులు..(IPL2022 PBKS Vs RCB)

Ipl2022 Pbks Vs Rcb

IPL2022 PBKS Vs RCB : ఐపీఎల్ 2022 సీజన్ 15 లో భాగంగా పంజాబ్ కింగ్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు భారీ స్కోర్ చేసింది. డబుల్ సెంచరీ స్కోరును దాటేసింది. నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. బెంగళూరు కెప్టెన్, ఓపెనర్ డుప్లెసిస్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపించాడు. పరుగుల వరద పారించాడు. హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశాడు.

కేవలం 57 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత విరాట్ కోహ్లి వీరవిహారం చేశాడు. 29 బంతుల్లోనే 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రెండు సిక్సులు, ఒక ఫోర్ కొట్టాడు. అనుజ్ రావత్(21), దినేష్ కార్తిక్(14 బంతుల్లో 32..3 సిక్సులు, 3 ఫోర్లు, నాటౌట్) రాణించారు. బెంగళూరు బ్యాటర్లు అంతా రాణించడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.(IPL2022 PBKS Vs RCB)

IPL 2022: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, యువరాజ్‌ సింగ్ లతో సమానంగా ఇషాన్ కిషన్

ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన పంజాబ్‌ బౌలింగ్‌ ఎంచుకుని బెంగళూరుకు బ్యాటింగ్‌ అప్పగించింది. పంజాబ్‌కు మయాంక్‌ అగర్వాల్, బెంగళూరుకు డుప్లెసిస్‌ తొలిసారి నాయకత్వం వహిస్తున్నారు. గత సీజన్‌లో చెన్నైకి ఆడిన డుప్లెసిస్‌ అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక కేఎల్ రాహుల్‌ను రిటెయిన్ చేసుకోకపోవడం, మెగా వేలంలోనూ పంజాబ్‌ కొనుగోలు చేయలేదు. దీంతో పంజాబ్‌ జట్టు పగ్గాలు మయాంక్‌కు దక్కాయి.

బెంగళూరు: డుప్లెసిస్(కెప్టెన్‌), కోహ్లీ, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

పంజాబ్ : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), ధావన్, లివింగ్‌స్టోన్, రాజపక్స, షారూక్ ఖాన్, ఒడియన్ స్మిత్, రాజ్ బావా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, సందీప్ శర్మ, రాహుల్ చాహర్

ఈసారి ఐపీఎల్ లో అహ్మదాబాద్ (గుజరాత్ టైటాన్స్), లక్నో (లక్నో సూపర్ జెయింట్స్) జట్లు కూడా ఆడుతుండగా, ఫ్రాంచైజీల సంఖ్య 10కి పెరిగింది. ఈ జట్లన్నింటికీ ముంబైలోని వివిధ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అయితే, ముంబైలో క్రికెట్ మైదానాలకు, ఆటగాళ్లు బస చేస్తున్న హోటళ్లు చాలా దూరంలో ఉన్నాయి. దాంతో, ఆటగాళ్లను మైదానానికి తరలించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేశారు.

IPL 2022: ఇషాన్ ఓపెనర్‌గా దిగితే హాఫ్ సెంచరీ ఖాయం.. రికార్డులివే

ఆటగాళ్లను తరలించే వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఈ గ్రీన్ కారిడార్లు హెల్ప్ అవుతాయి. ఇందుకోసం వెయ్యి మందికి పైగా పోలీసులను వినియోగిస్తున్నారు. ప్రతి జట్టుకు పోలీసు ఎస్కార్ట్ కల్పిస్తున్నట్టు ముంబై ట్రాఫిక్ పోలీసు విభాగం తెలిపింది. అదే సమయంలో, సాధారణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, వారిని ఇతర మార్గాల్లోకి మళ్లించే ఏర్పాట్లు చేశారు. ఈ సీజన్ లో ఐపీఎల్ ను టాటా గ్రూప్ స్పాన్సర్ చేస్తోంది.