IPL2022 RCB Vs RR : రాజస్తాన్ జోరుకి బ్రేక్.. బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ

ఉత్కంఠ పోరులో రాజస్తాన్ పై బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 170 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 19.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి..

Ipl2022 Rcb Vs Rr

IPL2022 RCB Vs RR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్లు తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్తాన్ పై బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

170 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 19.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. దీంతో 4 వికెట్ల తేడాతో రాజస్తాన్ పై గెలుపొందింది. బెంగళూరు బ్యాటర్లలో షాబాజ్ అహ్మద్ (26 బంతుల్లో 45 పరుగులు), దినేశ్ కార్తిక్ (23 బంతుల్లో 44 పరుగులు-నాటౌట్) అదరగొట్టారు. కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ దూకుడుగా ఆడి జట్టు గెలుపులో కీ రోల్ ప్లే చేశారు. డు ప్లెసిస్‌ (29), అనుజ్‌ రావత్‌ (26) ఫర్వాలేదనిపించారు. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. నవదీప్ సైని ఒక వికెట్ తీశాడు.

IPL2022 CSK Vs PBKS : చెన్నైకి ఏమైంది? హ్యాట్రిక్ ఓటమి.. పంజాబ్ ఘన విజయం

లక్ష్యఛేదనలో తొలుత బెంగళూరు తడబడింది. ఆ తర్వాత నిలబడింది. రాజస్తాన్ బౌలర్లు పుంజుకోవడంతో బెంగళూరు బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత బెంగళూరు బ్యాటర్లు నిలబడి జట్టుని గెలిపించారు.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టులో జోస్ బట్లర్ ఆఖరి ఓవర్లలో రెచ్చిపోయి ఆడాడు. దీంతో ఆ జట్టు ఓ మోస్తరు భారీ స్కోరు సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ 47 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు.

మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే అవుటైనా, వన్ డౌన్ ఆటగాడు దేవదత్ పడిక్కల్ (29 బంతుల్లో 37 పరుగులు.. 2 ఫోర్లు, 2 సిక్సులు)తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ (8) స్వల్ప స్కోరుకే అవుట్ కాగా, హెట్ మైర్ ధాటిగా ఆడాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో బట్లర్ 2 సిక్సులు, హెట్ మైర్ 1 సిక్స్ బాదారు. అంతకుముందు ఓవర్లోనూ బట్లర్ రెండు సిక్స్ లు కొట్టి పరుగుల పండగ చేసుకున్నాడు. ఈ జోడీ విజృంభణతో బెంగళూరు జట్టు చివరి 5 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకుంది. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లే, వనిందు హసరంగ, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

IPL2022 SH Vs LSG : చివర్లో చేతులెత్తేసిన హైదరాబాద్.. వరుసగా రెండో ఓటమి.. లక్నో ఖాతాలో మరో విజయం

బెంగళూరు చేతిలో ఓటమితో మెగా టోర్నీలో రాజస్తాన్ విజయాలకు బ్రేక్ పడినట్లు అయ్యింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో గెలుపొందిన రాజస్తాన్ జట్టు.. మూడో మ్యాచులో ఓటమిపాలైంది. మరోవైపు బెంగళూరు ఆడిన రెండు మ్యాచుల్లో.. ఓ దాంట్లో గెలుపొంది మరో దాంట్లో ఓటమి పాలైంది. ఇప్పుడు తన మూడో మ్యాచ్ లో రాజస్తాన్ ను చిత్తు చేసింది.