Ipl2022 Srh Vs Rr
IPL2022 SRH Vs RR : ఐపీఎల్ 2022 సీజన్ 15 లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు దంచి కొట్టింది. భారీ స్కోర్ చేసింది. డబుల్ సెంచరీ బాదింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ప్రత్యర్థి ముందు 211 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది.
రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 27 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. దేవ్ దత్ పడిక్కల్ (29 బంతుల్లో 41 పరుగులు), షిమ్రోన్ హెట్ మైర్ (13 బంతుల్లో 32 పరుగులు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ జోస్ బట్లర్ 35 పరుగులు, యశస్వీ జైస్వాల్ 20 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ తలో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, రొమెరియో షెఫర్డ్ చెరో వికెట్ తీశారు.(IPL2022 SRH Vs RR)
IPL 2022: కేన్ మామ వర్సెస్ శాంసన్.. సన్‌రైజర్స్ బౌలింగ్
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పుణెలోని ఎంసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. గతేడాది పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచిన హైదరాబాద్.. ఈసారైనా మెరుగ్గా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
వేలంలో పలువురు టీ20 స్పెషలిస్టులను కొనుగోలు చేసిన ఈ రెండు జట్లలో హైదరాబాద్ కంటే రాజస్తాన్ జట్టే కాస్తంత బలంగా కనిపిస్తోంది. ఆ జట్టులో జోస్ బట్లర్, కెప్టెన్ సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్, హెట్ మైర్, రవిచంద్రన్ అశ్విన్, చహల్, ట్రెంట్ బౌల్ట్ వంటి హేమాహేమీలున్నారు.
హైదరాబాద్ జట్టులో విలియమ్సన్, నికోలాస్ పూరన్, భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్, మార్ క్రమ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నప్పటికీ అందరూ సమష్టిగా రాణిస్తేనే గెలుపు సాధ్యమవుతుంది. వేలంలో కోట్లు పోసి కొనుగోలు చేసిన వెస్టిండీస్ ఆటగాడు రొమారియో షెపర్డ్ పైనే అందరి దృష్టి ఉంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండు రంగాల్లో ఉపయోగపడతాడని అతడిని సన్ రైజర్స్ కొనుగోలు చేసింది.
IPL 2022: సన్‌రైజర్స్ అద్భుతమైన ఆఫర్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ను మీరే ఎంచుకోవచ్చు!
ఐపీఎల్ 15వ సీజన్ శనివారం (మార్చి 26, 2022) నుంచి ప్రారంభమైంది. గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తొలి పోరులో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించింది. ఈసారి ఐపీఎల్ పోటీలు ముంబై, పుణె నగరాల్లోనే నిర్వహించనున్నారు.
ఈసారి ఐపీఎల్ లో అహ్మదాబాద్ (గుజరాత్ టైటాన్స్), లక్నో (లక్నో సూపర్ జెయింట్స్) జట్లు కూడా ఆడుతుండగా, ఫ్రాంచైజీల సంఖ్య 10కి పెరిగింది. ఈ జట్లన్నింటికీ ముంబైలోని వివిధ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అయితే, ముంబైలో క్రికెట్ మైదానాలకు, ఆటగాళ్లు బస చేస్తున్న హోటళ్లు చాలా దూరంలో ఉన్నాయి. దాంతో, ఆటగాళ్లను మైదానానికి తరలించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేశారు. గుజరాత్ జట్టుకు హర్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా, లక్నో జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.