IPLThemed Wedding Invite Of Tamil Nadu Couple Amuses Internet
Viral pic : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అందుకనే చాలా మంది తమ పెళ్లి అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా ఉండాలని కోరుకుంటారు. ఇక క్రికెట్ అంటే పడి చచ్చే వారు పెళ్లి చేసుకుంటే వారి వివాహంలో ఏదో ఒకటి క్రికెట్ కు సంబంధించి ఉండేలా చూసుకోవడం నేటి కాలంలో ఓ ట్రెండ్‌లా మారింది. తమిళనాడుకు చెందిన ఓ జంటకు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే పడి చచ్చేంత అభిమానం.
ఈ ఐపీఎల్ సమయంలోనే తమ వివాహం జరగడంతో తమ పెళ్లి పత్రికకు కాస్త ఐపీఎల్ టచ్ ఇచ్చారు. సీఎస్‌కే కలర్స్‌తో పాటు వధూవరుల పేర్లను ఐకానిక్ లోగో లోపల ముద్రించారు. పెళ్లి సమయాన్ని, రిసెప్షన్ వంటి వివరాలను ఐపీఎల్ టికెట్ రూపంలో అందించారు. అంతేకాదండోయ్.. క్రికెట్ మ్యాచ్‌లో ఉపయోగించే పదాలైన మ్యాచ్ ప్రివ్యూ, మ్యాచ్ ప్రిడిక్షన్ వంటి పదాలను ఉపయోగించారు. దీంతో వీరి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక వైరల్‌గా మారింది.
కాగా.. వీరి వివాహాం ఏప్రిల్ 17న సాయంత్రం 4.30 గంటలకు జరిగింది. తమిళంలోని అరక్కోణంలోని సెయింట్ ఆండ్రూ చర్చిలో వీరిద్దరూ ఒక్కటి అయ్యారు.
గిఫ్ల్టీన్ పెర్సి, మార్టిన్ రాబర్ట్ లు తాము ఒక్కటి కావడాన్ని ఫాన్‌టాస్టిక్ పార్టనర్‌షిప్‌గా పోల్చారు. ట్రోఫీ తరహా కటవుట్ పోస్టర్‌తో ఫొటోలతో కూడిన వీరి ఫోజ్ అదిరిపోయింది. ఈ ఆహ్వాన పత్రిక వైరల్‌గా మారగా.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు.
Aaron Finch : ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. అదొక్కటే మార్గం : ఫించ్