Aaron Finch : ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. అదొక్కటే మార్గం : ఫించ్
ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది.

Hardik Pandya needs to find some Aaron Finch
Aaron Finch – Hardik Pandya : ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడగా కేవలం రెండు మ్యాచుల్లోనే గెలుపొందింది. నాలుగు పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. కాగా.. ముంబై విజయాల బాట పట్టాలంటే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు.
ముంబై జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాట్‌తో పాటు బంతితో నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. జట్టును ముందుండి నడిపించాలంటే వ్యక్తిగతంగానూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. కొన్ని మ్యాచుల్లో బౌలింగ్ చేశాడు. మరికొన్ని మ్యాచుల్లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. అతడు ఇలాగే చేస్తే ముంబై ఓటముల నుంచి విజయాల బాట పట్టడం కష్టమేనని ఫించ్ అభిప్రాయ పడ్డాడు.
CSK : సీజన్ మధ్యలో చెన్నైకు భారీ ఎదురుదెబ్బ.. విజయావకాశాలపై ప్రభావం..!
బౌలర్ల విషయానికి వస్తే.. జస్‌ప్రీత్ బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు నిలకడగా రాణించడం లేదన్నాడు. అతడికి సరైన సహకారం లభించకపోవడం వల్ల ఒత్తడిని ఎదుర్కొవాల్సి వస్తుందన్నాడు.
ఐపీఎల్ 17వ సీజన్‌లో హార్దిక్ పాండ్యా ఆరు ఇన్నింగ్స్‌లలో 145.6 స్ట్రైక్ రేట్‌తో 131 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఓవర్‌కు 12 ఎకానమీ రేటును కలిగి ఉన్నాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఐపీఎల్‌లో ఫామ్ అందుకుని టీ20 ప్రపంచకప్‌ను బెర్తును దక్కించుకోవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.