Ishan Kishan : రీ ఎంట్రీలో తుస్‌మ‌న్న ఇషాన్ కిష‌న్.. ఇంకా కోలుకోలేదా?

రీ ఎంట్రీలో టీమ్ఇండియా యువ ఆట‌గాడు ఇషాన్ కిష‌న్ విఫ‌లం అయ్యాడు.

Ishan Kishan Flops On Finally Returning To Action

రీ ఎంట్రీలో టీమ్ఇండియా యువ ఆట‌గాడు ఇషాన్ కిష‌న్ విఫ‌లం అయ్యాడు. మాన‌సిక అల‌స‌ట కార‌ణంగా ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న నుంచి మ‌ధ్య‌లోనే భార‌త్‌కు వ‌చ్చాడు ఇషాన్‌. గ‌త మూడు నెల‌లుగా ఎలాంటి క్రికెట్ ఆడ‌లేదు. రంజీ ట్రోఫీ ఆడాల‌ని బీసీసీఐ సూచించినా పెడ‌చెవిన పెట్టారు. అయితే.. మ‌రో 25 రోజుల్లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఆరంభం కానుండ‌డంతో ఈ టోర్నీలో ఆడే ముందు ఫామ్ అందుకోవాల‌ని ఇషాన్ భావించాడు. ఈ క్ర‌మంలో డీవై పాటిల్ టీ20 టోర్న‌మెంట్‌లో ఆడుతున్నాడు.

ఆర్‌బీఐ జ‌ట్టు త‌రుపున బ‌రిలోకి దిగాడు. దాదాపు మూడు నెల‌ల విరామం త‌రువాత మైదానంలో అడుగుపెట్టిన ఇషాన్ త‌న మొద‌టి మ్యాచ్‌లో విఫ‌లం అయ్యాడు. రూట్ మొబైల్ లిమిటెడ్ తో జ‌రిగిన మ్యాచ్‌లో 12 బంతులు ఎదుర్కొన్న అత‌డు 19 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, ఓ సిక్స‌ర్ ఉన్నాయి. ఉన్నంత సేపు ధాటిగా ఆడిన ఇషాన్ ఎక్కువ సేపు క్రీజులో ఉండ‌లేక‌పోయాడు. బ్యాటింగ్‌లో విఫ‌లం అయిన‌ప్ప‌టికీ కీపింగ్‌లో ఫ‌ర్వాలేద‌నిపించాడు. ఓ స్టంపౌట్ చేశాడు.

IND vs ENG : రోహిత్ శ‌ర్మ‌కు విశ్రాంతి? ఆఖ‌రి టెస్టులో కెప్టెన్‌గా బుమ్రా?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన రూట్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 192 ప‌రుగులు చేసింది. రూట్ బ్యాట‌ర్ల‌లో ఆయుష్ వ‌ర్త‌న్ 31 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్స‌ర్లతో 54 ప‌రుగులు చేశాడు. ధెకాలే ధాటిగా ఆడాడు. 17 బంతుల్లో ఒక ఫోర్‌, ఐదు సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఆర్‌బీఐ 16.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రూట్‌లో బద్రీ ఆలం ఐదు వికెట్ల‌తో చెల‌రేగాడు. దీంతో 89 ప‌రుగుల తేడాతో రూట్ గెలుపొందింది.

కాగా.. ఇషాన్ ఔటైన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఏంటి ఇషాన్ ఇంకా కోలుకోలేదా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

WPL 2024 : న‌న్ను పెళ్లి చేసుకుంటావా..? లైవ్ మ్యాచ్‌లో భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌కి ప్రపొజ‌ల్‌.. రిప్లై ఏమి వ‌చ్చిందంటే?