IND vs ENG : రోహిత్ శ‌ర్మ‌కు విశ్రాంతి? ఆఖ‌రి టెస్టులో కెప్టెన్‌గా బుమ్రా?

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భార‌త్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సొంతం చేసుకుంది.

IND vs ENG : రోహిత్ శ‌ర్మ‌కు విశ్రాంతి? ఆఖ‌రి టెస్టులో కెప్టెన్‌గా బుమ్రా?

Team India

IND vs ENG 5 Test : ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భార‌త్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సొంతం చేసుకుంది. దీంతో నామ‌మాత్ర‌మైన చివ‌రి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ధ‌ర్మ‌శాల పిచ్ పేస‌ర్ల‌కు స్వ‌ర్గ‌ధామం కావ‌డంతో బుమ్రా ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. ప‌నిభారం దృష్ట్యా అత‌డికి రాంచీ టెస్టు మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు.

ఇప్ప‌టికే టెస్టు సిరీస్ గెల‌వ‌డంతో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు సైతం విశ్రాంతి ఇవ్వ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. రోహిత్ గైర్హాజ‌రీలో వైస్ కెప్టెన్ అయిన బుమ్రా నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం ఉంది. కాగా.. ఈ సిరీస్‌లో న‌లుగురు ర‌జ‌త్ పాటిదార్‌, స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, ధ్రువ్ జురెల్‌, ఆకాశ్ దీప్‌లు అరంగ్రేటం చేశారు. వీరిలో ర‌జ‌త్ మిన‌హా మిగిలిన అంద‌రూ రాణించారు. వ‌రుస‌గా మూడు మ్యాచుల్లో అవ‌కాశం ఇచ్చిన విఫ‌లం అవ్వ‌డంతో ర‌జ‌త్ పై వేటు వేటు వేస్తారా..? లేదంటే రోహిత్ కు విశ్రాంతి ఇవ్వ‌నుండ‌డంతో అత‌డికి మ‌రో ఛాన్స్ ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ సైతం అరంగ్రేటం చేసే అవ‌కాశం ఉంది.

WPL 2024 : న‌న్ను పెళ్లి చేసుకుంటావా..? లైవ్ మ్యాచ్‌లో భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌కి ప్రపొజ‌ల్‌.. రిప్లై ఏమి వ‌చ్చిందంటే?

ఫిట్‌గా లేని రాహుల్‌..

తొలి టెస్టులో కేఎల్ రాహుల్ తొడ కండ‌రాల గాయం బారిన ప‌డ్డాడు. దీంతో అత‌డు వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు. అయితే.. ఇంకా ఆ గాయం నుంచి కోలుకోక‌పోవ‌డంతో ఆఖ‌రి టెస్టు మ్యాచ్‌కు అత‌డు అందుబాటులో ఉండ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చికిత్స కోసం అత‌డు లండ‌న్‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మార్చి 7 నుంచి జ‌ర‌గ‌నున్న టెస్టు మ్యాచ్ కోసం భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు మార్చి 3న ధ‌ర్మ‌శాల‌కు చేరుకోనున్నాయి.

Shreyas Iyer : పురుషుల జ‌ట్టు నుంచి తొల‌గించార‌ని.. మ‌హిళ‌ల లీగ్‌లో అంపైరింగ్ చేస్తున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ ?

భారత జట్టు : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ( కెప్టెన్ ), శుభ్‌మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జ‌స్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్

ఇంగ్లాండ్ జట్టు : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్, షోయాబ్ బషీర్, ఆలీ రాబిన్సన్, డేనియల్ లారెన్స్, గుస్ అట్కిన్సన్.