×
Ad

Ishan Kishan : వాడికి పెళ్లి వ‌య‌సు రాలేదు.. ఇషాన్ కిష‌న్ త‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మోడ‌ల్ అదితి హుండియాతో డేటింగ్ పై ఏమ‌న్న‌దంటే?

ఇషాన్ కిష‌న్ (Ishan Kishan ) పెళ్లి వార్త‌ల‌పై అత‌డి త‌ల్లి సుచిత్రా దేవి స్పందించింది.

Ishan Kishan Mother denied the rumours to his son To Marry Aditi Hundia

Ishan Kishan Mother : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఎడ‌మ చేతి వాటం ఆట‌గాడు 40 బంతుల‌ను ఎదుర్కొని 77 ప‌రుగులు చేసి భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలో ఇషాన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది.

అత‌డి కుటుంబ స‌భ్యులు కూడా అత‌డి ఆట తీరు పై స్పందించారు. ఇషాన్ దృష్టి ప్ర‌స్తుతం క్రికెట్ పైనే ఉన్న‌ప్ప‌టికి కూడా మోడల్ అదితి హుండియాతో అతడి సంబంధం గురించి అతడి తాత చేసిన వ్యాఖ్యలు సమీప భవిష్యత్తులో వివాహం జరగవచ్చనే పుకార్లకు దారితీశాయి.

T20 World Cup 2026 : న‌మీబియాతో మ్యాచ్‌లో పాక్ ఓడిపోతే ప‌రిస్థితి ఏంటి? అమెరికా, పాక్‌ల‌లో సూప‌ర్‌-8కి అర్హ‌త సాధించేది ఎవ‌రు?

వీటిపై ఇషాన్ త‌ల్లి సుచిత్రా దేవి స్పందించింది. అవ‌న్నీ పుకార్లేన‌ని స్ప‌ష్టం చేసింది. ఇషాన్ పూర్తిగా ఆట‌పై దృష్టి పెట్టాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చెప్పుకొచ్చింది.

‘ఇది పెళ్లి గురించి కాదు. ఇది అత‌డు క్రికెట్ ఆడే సమయం. అతనికి పెళ్లి గురించి మాట్లాడేంత వయసు లేదు. తాతయ్య కొంచెం పెద్దవాడవుతున్నాడు. వృద్ధులు ఎప్పుడూ మ‌నుమ‌ల విష‌యంలో కాస్త ఉత్సుక‌త‌తో ఉంటారు. సోషల్ మీడియాలో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో చూసిన దాని ఆధారంగా అతను (తాత‌) ఇదంతా చెప్పాడు. అంతే కానీ ఇంకా ఏమీ లేదు.’  అని IANSతో సుచిత్రా అంది.

ఇషాన్ కిష‌న్ తాత ఏమ‌న్నాడంటే?

ఇషాన్ కిషన్ తాత అనురాగ్ పాండే తన మనవడు గురించి మాట్లాడుతూ మోడల్ అదితి హుండియాతో డేటింగ్ చేస్తున్నాడని ధృవీకరించాడు. వారు వివాహం చేసుకోవాలనుకుంటే తనకు ఎటువంటి సమస్యలు లేవని చెప్పాడు.

T20 World Cup 2026 : టీమ్ ఇండియా సూప‌ర్ 8 షెడ్యూల్ ఫిక్స్‌.. ఏ జ‌ట్టుతో ఏ రోజున ఆడ‌నుందంటే?

ఇషాన్ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. అదితి అతడి స్నేహితురాలు. ఆమె ఒక మోడల్. పిల్లలను సంతోషపెట్టే వాటిని అంగీకరించాలి. అని ఆయన ఏఎన్ఐతో చెప్పారు.