Jadeja Becomes 5th Indian Bowler To take 50 wickets in Tests against South Africa
Ravindra Jadeja : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో 50 వికెట్లు తీశాడు. గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో అతడు ర్యాన్ రికెల్టన్ (35), ఐడెన్ మార్‌క్రమ్ (29)లను ఔట్ చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇక ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా పై టెస్టుల్లో 50కి పైగా వికెట్లు సాధించిన ఐదో భారత బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
అనిల్‌కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ లు మాత్రమే జడేజా కన్నా ముందు ఈ ఘనత సాధించారు. జడేజా 19 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు సాధించాడు. కాగా.. టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. కుంబ్లే 21 మ్యాచ్‌ల్లో 84 వికెట్లు పడగొట్టాడు.
దక్షిణాఫ్రికా పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే..
* అనిల్ కుంబ్లే – 21 మ్యాచ్‌ల్లో 84 వికెట్లు
* జవగల్ శ్రీనాథ్ – 13 మ్యాచ్‌ల్లో 64 వికెట్లు
* హర్భజన్ సింగ్ – 11 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు
* రవిచంద్రన్ అశ్విన్ – 14 మ్యాచ్‌ల్లో 57 వికెట్లు
* రవీంద్ర జడేజా – 11 మ్యాచ్‌ల్లో 50* వికెట్లు
* మహ్మద్ షమీ – 11 మ్యాచ్‌ల్లో 48 వికెట్లు
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* అనిల్ కుంబ్లే – 21 మ్యాచ్‌ల్లో 84 వికెట్లు
* డేల్ స్టెయిన్ – 14 మ్యాచ్‌ల్లో 65 వికెట్లు
* జవగల్ శ్రీనాథ్ – 13 మ్యాచ్‌ల్లో 64 వికెట్లు
* హర్భజన్ సింగ్ – 11 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు
* మోర్నీ మోర్కెల్ – 17 మ్యాచ్‌ల్లో 58 వికెట్లు