ధ‌ర్మ‌శాల టెస్టులో య‌శ‌స్వి జైస్వాల్ రికార్డులు ఇవే.. వెయ్యి ప‌రుగులు, అత్య‌ధిక సిక్స‌ర్లు..

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు.

Yashasvi Jaiswal 1000 test runs : ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. బౌండ‌రీల వ‌ర్షం కురిపిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి టెస్టుల్లో 1000 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో భార‌త ఆట‌గాళ్ల‌లో అతి త‌క్కువ టెస్టు మ్యాచుల్లో వెయ్యి ప‌రుగులు పూర్తి చేసుకున్న ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. జైస్వాల్ కేవలం తొమ్మిది టెస్టు మ్యాచుల్లోనే ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

అతి త‌క్కువ టెస్టు మ్యాచుల్లో వెయ్యి ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాళ్లు..
య‌శ‌స్వి జైస్వాల్ – 9 టెస్టులు
ఛ‌తేశ్వ‌ర పుజారా – 11 టెస్టులు
సునీల్ గ‌వాస్క‌ర్ – 11 టెస్టులు
వినోద్ కాంబ్లీ – 12 టెస్టులు

ఆ జాబితాలో రెండో స్థానం..
ఇన్నింగ్స్‌ల ప‌రంగా టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి ప‌రుగులు పూర్తి చేసుకున్న భార‌త ఆట‌గాళ్ల జాబితాలో రెండో స్థానంలో య‌శ‌స్వి జైస్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో వినోద్ క్లాంబీ మొద‌టి స్థానంలో ఉన్నాడు. అత‌డు 14 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి ప‌రుగులు చేయ‌గా ఇందుకు జైస్వాల్‌కు 16 ఇన్నింగ్స్ అవ‌స‌రం అయ్యాయి.

Also Read : హాస్పిట‌ల్‌ బెడ్ పై ఉన్న అమ్మ నాకు చెప్పింది అదే : ర‌విచంద్ర‌న్ అశ్విన్‌

టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాళ్లు.. (ఇన్నింగ్స్‌ల ప‌రంగా)
వినోద్ కాంబ్లీ -14 ఇన్నింగ్స్‌లు
య‌శ‌స్వి జైస్వాల్ – 16 ఇన్నింగ్స్‌లు
ఛ‌తేశ్వ‌ర్ పుజ‌రా – 18
మ‌యాంక్ అగ‌ర్వాల్ – 19
సునీల్ గ‌వాస్క‌ర్ – 21

ఓ సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాళ్ల జాబితా..
ఓ సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాళ్ల జాబితాలో య‌శ‌స్వి మూడో స్థానానికి చేరుకున్నాడు. సునీల్ గ‌వాస్క‌ర్ త‌రువాత ఓ టెస్టు మ్యాచ్ సిరీస్‌లో 700 ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డును ఎక్కాడు.

సునీల్‌ గవాస్కర్ – 774 పరుగులు (1971లో వెస్టిండీస్ పై)
సునీల్‌ గవాస్కర్ – 732 పరుగులు (1978లో వెస్టిండీస్‌పై)
యశస్వి జైస్వాల్ – 712 పరుగులు (2024లో ఇంగ్లాండ్‌పై)
విరాట్‌ కోహ్లి – 692 పరుగులు (2014/15లో ఆస్ట్రేలియాపై)

ఓ జ‌ట్టు పై అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త ఆట‌గాళ్లు..
ఓ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాళ్ల జాబితాలో య‌శ‌స్వి తొలి స్థానంలో నిలిచాడు.

యశస్వి జైస్వాల్ – 26* సిక్స‌ర్లు (ఇంగ్లాండ్‌పై 9 ఇన్నింగ్స్‌ల్లో)
సచిన్‌ టెండుల్కర్ – 25 (ఆస్ట్రేలియా పై 74 ఇన్నింగ్స్‌)
రోహిత్‌ శర్మ – 22 (ద‌క్షిణాఫ్రికా పై 20 ఇన్నింగ్స్‌ల్లో)
కపిల్‌ దేవ్ – 21 (ఇంగ్లాండ్ పై 39 ఇన్నింగ్స్‌ల్లో)
రిషభ్‌ పంత్ – 21 (ఇంగ్లాండ్ పై 21 ఇన్నింగ్స్‌ల్లో)

Also Read : బిగ్‌బాస్ విన్న‌ర్ చేతిలో ఔటైన స‌చిన్ టెండూల్క‌ర్‌.. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు