Jammu and Kashmir defeat Delhi in Ranji Trophy after 65 years
Jammu and Kashmir : రంజీట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ అరుదైన ఘనత సాధించింది. 65 ఏళ్ల తమ రంజీ ట్రోఫీ చరిత్రలో ఆ జట్టు తొలిసారి ఢిల్లీ పై విజయం సాధించింది. ఇప్పటి వరకు 42 సార్లు నిరాశే ఎదురవ్వగా.. 43వ ప్రయత్నంలో తొలి విజయాన్ని అందుకుంది. మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ పై జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir ) విజయాన్ని అందుకుంది.
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో ఆయుష్ బదోని (64), ఆయుష్ దోసేజా (65), సుమిత్ మాథుర్ (55) హాఫ్ సెంచరీలు చేశారు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్లు అయ్యారు. జమ్మూ బౌలర్లలో ఆకిబ్ నబీ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. వన్ష్‌రాజ్ శర్మ, ఆబిద్ ముస్తాక్ చెరో రెండు వికెట్లు తీశారు.
🚨 A HISTORIC DAY IN JAMMU & KASHMIR CRICKET 🚨
– Jammu & Kashmir has defeated Delhi for the first time in Ranji Trophy history. 🔥🤯 pic.twitter.com/VxNFBOj7QW
— Johns. (@CricCrazyJohns) November 11, 2025
ఆ తరువాత.. కెప్టెన్ పరాస్ డోగ్రా (106) శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూకాశ్మీర్ జట్టు 310 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టుకు 99 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఢిల్లీ బౌలర్లలో సిమర్‌జీత్ ఆరు వికెట్లు పడగొట్టాడు.
Azam Khan : మ్యాచ్ మధ్యలో ఘోర అవమానం.. ఏడ్చేసిన పాక్ క్రికెటర్ ఆజం ఖాన్.. నాకు ఇజ్జత్ ఉందా?
ఆ తరువాత 99 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ 277 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో ఆయుష్ బదోని(72), ఆయుష్ డోసెజా(62) అర్ధశతకాలు సాధించారు. వన్షాజ్ శర్మ ఆరు వికెట్లు తీశాడు.
179 పరుగుల లక్ష్యాన్ని జమ్మూ కాశ్మీర్ 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. జమ్మూ బ్యాటర్లలో ఖమ్రాన్ ఇక్బాల్ (133 నాటౌట్) అజేయ శతకంతో జట్టుకు విజయాన్ని అందించాడు.