Azam Khan : మ్యాచ్ మ‌ధ్య‌లో ఘోర అవ‌మానం.. ఏడ్చేసిన పాక్ క్రికెట‌ర్ ఆజం ఖాన్‌.. నాకు ఇజ్జ‌త్ ఉందా?

పాకిస్తాన్ ఆట‌గాడు ఆజం ఖాన్ (Azam Khan) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Azam Khan : మ్యాచ్ మ‌ధ్య‌లో ఘోర అవ‌మానం.. ఏడ్చేసిన పాక్ క్రికెట‌ర్ ఆజం ఖాన్‌.. నాకు ఇజ్జ‌త్ ఉందా?

Azam Khan Confesses Feeling Humiliated Like Never Before Mid Match

Updated On : November 11, 2025 / 12:49 PM IST

Azam Khan : పాకిస్తాన్ ఆట‌గాడు ఆజం ఖాన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్ మోయిన్‌ ఖాన్ కుమారుడిగా క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన‌ప్ప‌టికి త‌న కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును మాత్రం సాధించ‌లేక‌పోయాడు. 2021లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన ఆజం ఖాన్ (Azam Khan) 2024లో చివ‌రి సారిగా పాక్‌కు ప్ర‌తినిధ్యం వ‌హించాడు. మొత్తంగా అత‌డు 14 అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 88 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అత‌డి ఖాతాలో ఒక్క హాఫ్ సెంచ‌రీ కూడా లేదు. ఇక వికెట్ కీప‌ర్‌గా కూడా దారుణంగా నిరాశ‌ప‌రిచాడు. ఈ క్ర‌మంలో అత‌డు మీమ్ మెటీరియ‌ల్‌గా మారాడు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పాక్ జ‌ట్టు సెమీస్ చేర‌కుండానే నిష్ర్క‌మించింది. త‌న తండ్రి గొప్ప ఆట‌గాడు కావ‌డంతోనే ఆజంఖాన్‌కు అవ‌కాశాలు ఇస్తున్నార‌ని, అత‌డి కంటే ఎన్నోరెట్ల నైపుణ్యాలు క‌లిగిన యువ ఆట‌గాళ్లు ఎంతో మంది ఉన్నారని, వారికి చోటు ఇవ్వాల‌నే డిమాండ్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 త‌రువాత‌ ఆజం ఖాన్ మ‌ళ్లీ పాక్ జాతీయ జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు.

Sanju Samson : ట్రేడింగ్ రూమ‌ర్ల మ‌ధ్య‌.. సంజూ శాంస‌న్ పై చెన్నై సూప‌ర్ కింగ్స్ పోస్ట్..

అత‌డి పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌కు తోడు అత‌డి భారీ ఖాయంపై కూడా ట్రోల్స్ వ‌చ్చాయి. కాగా.. వీటి అన్నింటిపై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆజం ఖాన్ స్పందించాడు. 2024లో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఓ మ్యాచ్‌లో తాను తాను అవహేళనకు గురయ్యాయని చెప్పుకొచ్చాడు. తన జీవితంలో అత్యంతగా బాధపడ్డ సందర్భం అదేనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఆ అభిమాని అన్న మాట‌లు నా జీవితంలో మ‌ర్చిపోలేను..

‘ఆ మ్యాచ్‌లో నేను బ్యాటింగ్‌కు వెళ్లాను. నేను ఎదుర్కొన్న మొదటి బంతిని ఇంగ్లాండ్ పేస‌ర్ మార్క్‌వుడ్ బౌన్స‌ర్‌గా వేశాడు. నేను దానిని వ‌దిలి వేశాను. పాక్‌లో కూడా 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేసే బౌల‌ర్లు ఉండ‌డంతో నాకు కొత్త‌గా ఏమీ అనిపించ‌లేదు. అత‌డు రెండో బంతిని కూడా బౌన్స‌ర్ వేశాడు. అయితే.. ఈ సారి నేను దానిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన లేక‌పోయాను. అపుడు నా జీవితం స్తంభించిపోయినట్లుగా అనిపించింది. అసలు నాకేం అవుతుందో కూడా అర్థం కాలేదు.’ ఆజం ఖాన్ చెప్పుకొచ్చాడు.

‘నా వేలికి గాయ‌మైంది. నేను ఔట్ అయ్యాన‌ని నాకు తెలుసు. నేను గ్రౌండ్ ను విడిచి వెలుతున్న‌ప్పుడు ఓవ‌ల్‌లోని ప్రేక్ష‌కులు న‌న్ను అభ్యంత‌ర‌క‌ర బాష‌లో దూషించారు. ఇక ఓ పాకిస్తానీ రిపోర్ట‌ర్ తాగి ఉన్న ఓ ఇంగ్లాండ్ జ‌ట్టు అభిమానిని మీకు ఇష్ట‌మైన పాక్ ఆట‌గాడు ఎవ‌రు అని అడిగాడు. అందుకు అత‌డు నా పేరును చెప్పాడు. ఎందుకు అంటే అత‌డు బ్యాటింగ్ చేయ‌లేడు, ఫీల్డింగ్ చేయ‌లేడు.’ అంటూ త‌న‌పై సెటైర్లు వేశార‌ని ఆజం ఖాన్ తెలిపాడు.

Quinton de Kock : క్వింట‌న్ డికాక్ అరుదైన ఘ‌న‌త.. విరాట్ కోహ్లీ, జోరూట్‌, డివిలియ‌ర్స్‌, కేన్ విలియ‌మ్స‌న్ రికార్డులు బ్రేక్‌..

అత‌డి మాట‌లు విని త‌న హృద‌యం ముక్క‌లైంద‌న్నాడు. ‘నాక‌స‌లు ఇజ్జ‌త్ (గౌర‌వం) ఉందా? నా గురించి ప్ర‌జ‌లు ఇలా అనుకుంటున్నారా? అనే బాధ‌లో ఉండిపోయాను. ఈ క్ర‌మంలో ఎంతో ఈజీ క్యాచ్‌ల‌ను కూడా అందుకోలేక‌పోయాను.’ అని ఆజం ఖాన్ చెప్పాడు.

‘ఇక మైదానంలోనే నాకు క‌న్నీళ్లు వ‌చ్చాయి. నాకే ఇలా ఎందుకు జ‌రుగుతోంద‌ని భావోద్వేగానికి లోనైయ్యా.’ అని ఆజం ఖాన్ తెలిపాడు. కాగా.. ఆ మ్యాచ్‌లో ఆజం ఖాన్‌ డకౌట్ అయ్యాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ జ‌ట్టు 19.5 ఓవర్లలో 157కు ఆలౌటైంది. 158 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 15.3 ఓవ‌ర్ల‌లో ఛేదించింది.