Jason Holder Slip Delivery In ILT20 Stumps Video Goes Viral (PIC CREDIT @ILT20Official)
ILT20 : క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు కొన్ని సరదా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్‌లోనే అలాంటి ఓ ఘటననే చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా గురువారం (జనవరి 1) దుబాయ్ క్యాపిటల్స్, అబుదాబి నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అబుదాబి నైట్‌రైడర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అబుదాబి బ్యాటర్లలో మైఖేల్ పెప్పర్ (72; 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఫిల్ సాల్ట్ (43; 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ హోల్డర్ (22 నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. దుబాయ్ బౌలర్లలో మహ్మద్ నబీ మూడు వికెట్లు తీశాడు. హైదర్ అలీ, వకార్ సలాంఖేల్ లు చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత 159 పరుగుల లక్ష్య ఛేదనలో దుబాయ్ క్యాపిటల్స్ 16.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. దీంతో అబుదాబి 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ నబీ (27), జేమ్స్ నీషమ్ (19)లు పర్వాలేదనిపించగా మిగిలిన వారంతా ఘోరంగా విఫలం అయ్యారు. అబుదాబి బౌలర్లలో కెప్టెన్ జేసన్ హోల్డర్, సునీల్ నరైన్, లియామ్ లివింగ్ స్టోన్ లు తలా మూడు వికెట్లు తీశారు. అజయ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టాడు.
కాగా.. దుబాయ్ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ను జేసన్ హోల్డర్ వేశాడు. రెండో బంతికే వికెట్ పడగొట్టాడు. అయితే.. ఐదో బంతిని వేసే క్రమంలో బాల్ అతడి చేజారింది. దీంతో బంతి పిచ్ పై పడకుండా నేరుగా గాలిలో చాలా ఎత్తుకు వెళ్లి దాదాపు సెకండ్ స్లిప్‌కు దగ్గరలో పడింది. దీన్ని చూసిన బ్యాటర్ కు దిమ్మతిరిగిపోయింది. అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఫీల్డర్, అభిమానులు నవ్వుకున్నారు. ఇక అంపైర్ మాత్రం ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు.
“TV Umpire to Director, can we check the height on this one for a No Ball?” 🫣
Keep those towels handy, Knights. 🧻#DCvADKR #DPWorldILT20 #WhereTheWorldPlays #AllInForCricket pic.twitter.com/Mi43Apq7hB
— International League T20 (@ILT20Official) January 1, 2026
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కదా బౌలింగ్ అంటే సరదాగా సెటైర్లు వేస్తున్నారు. రోహిత్, కోహ్లీనే కాదు ప్రపంచంలో ఏ బ్యాటర్ కూడా ఈ బాల్ ను కొట్టలేరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.