Jasprit Bumrah becomes first indian Pacer to play 50 matches in all formats
Jasprit Bumrah : టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. భారత క్రికెట్‌లో చరిత్రలో మూడు ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) 50కి పైగా మ్యాచ్‌లు ఆడిన ఏకైక పేస్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోవడం ద్వారా బుమ్రా ఈ ఘనతను అందుకున్నాడు.
31 ఏళ్ల బుమ్రా ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున 50 టెస్టులు, 89 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 222 వికెట్లు, వన్డేల్లో 149 వికెట్లు, టీ20ల్లో 96 వికెట్లు సాధించాడు.
ఇక మూడు ఫార్మాట్లలో 50కి పైగా మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్‌లు బుమ్రా కన్నా ముందు ఉన్నారు.
టీమ్ఇండియా తరుపున మూడు ఫార్మాట్లలో 50కి పైగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 123 టెస్టులు, 302 వన్డేలు, 125 టీ20 మ్యాచ్‌లు (మొత్తంగా 550 అంతర్జాతీయ మ్యాచ్‌లు)
* ఎంఎస్ ధోని – 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు (మొత్తం 538 మ్యాచ్‌లు)
* రోహిత్ శర్మ – 67 టెస్టులు, 237 వన్డేలు, 159 టీ20 మ్యాచ్‌లు (మొత్తం 499 మ్యాచ్‌లు)
* రవీంద్ర జడేజా – 86 టెస్టులు, 204 వన్డేలు, 74 టీ20 మ్యాచ్‌లు (మొత్తం 364 మ్యాచ్‌లు)
* రవిచంద్రన్ అశ్విన్ – 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు (మొత్తం 287 మ్యాచ్‌లు)
* జస్‌ప్రీత్ బుమ్రా – 50 టెస్టులు, 89 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లు (మొత్తంగా 214 మ్యాచ్‌లు)
IND W : దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్ సెమీస్‌కు చేరాలంటే..?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు లంచ్ విరామానికి టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. క్రీజ్‌లో యశస్వి జైస్వాల్ (40), సాయి సుదర్శన్ (16) లు ఉన్నారు. అంతకముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ 38 పరుగులు చేశాడు.