Jasprit Bumrah Comments after PLAYER OF THE MATCH in 3rd T20 against New Zealand
Jasprit Bumrah : గౌహతి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి డేంజర్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్‌తో పాటు మిచెల్ సాంట్నర్, కైల్ జేమీసన్‌లను ఔట్ చేశాడు. అద్భుత ప్రదర్శన చేయడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బుమ్రా అందుకున్నాడు. ఈక్రమంలో అతడు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైయ్యాడు.
తన కెరీర్ ప్రారంభంలో తన విలక్షణమైన బౌలింగ్ యాక్షన్ చూసి ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఆడలేనని చాలా మంది విమర్శించారని గుర్తు చేసుకున్నాడు. కానీ తాను అంతర్జాతీయ క్రికెట్‌లో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
SA20 : ముచ్చటగా మూడోసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ విజేతగా సన్‌రైజర్స్.. కావ్య పాప ఆనందాన్ని చూశారా?
ఇక ఈ మ్యాచ్‌లో తాను బౌలింగ్ చేయడానికి కన్నా ముందు.. హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యాలు ఎలా బౌలింగ్ చేస్తున్నారో, పిచ్ ఎలా స్పందిస్తుంది అన్న విషయాలను గమనించానని బుమ్రా చెప్పుకొచ్చాడు. ఇక తాను బౌలింగ్ చేసే సమయానికి బంతి కాస్త పాతబడిందని తెలిపాడు. సాధారణంగా కొత్త బంతి ఎక్కువగా స్వింగ్ కాదని, బంతి కాస్త పాత బడడంతో పిచ్ కండిషన్స్ తగ్గట్లుగా బౌలింగ్ చేసి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని అన్నాడు.
తాను జట్టు కోసం ఆడతానని తెలిపాడు. కొత్త లేదా పాత బంతితో ఎప్పుడు బౌలింగ్ చేయమన్నా కూడా బౌలింగ్ చేసేందుకు తాను సిద్ధంగా ఉంటానన్నాడు. ఇక ఆసియాకప్‌లో కూడా తాను పాత బంతితో బౌలింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. జట్టు అవసరాలకు తగ్గట్లుగా బౌలింగ్ చేయడమే ముఖ్యమని చెప్పుకొచ్చాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా జట్టు విజయాల్లో తాను భాగం అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకోవడం పై..
జాతీయ జట్టుకు ఆడడమే తనకు చిన్నప్పటికి ఉన్న ఏకైక కల అని బుమ్రా తెలిపాడు. తాను ఆల్‌రౌండర్ కాదన్నాడు. పేసర్‌గా.. గాయాలు, నొప్పులు, అప్పుడప్పుడు ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఈ ఈ స్థాయికి వచ్చానని అన్నాడు. దేశం 10 ఏళ్లు ఆడడం గొప్పగా ఉందన్నాడు. కెరీర్ ఆరంభించినప్పుడు 6 నెలలు కూడా ఆడడని అన్నారని, ఇన్నేళ్ల పాటు ఆడడం పట్ల నిజంగా తాను గర్వపడుతున్నానని తెలిపాడు. మరికొంత కాలం పాటు ఈ ప్రయాణం కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు బుమ్రా తెలిపాడు.