Jasprit Bumrah : కేప్‌టౌన్‌లో బుమ్రా రికార్డులు.. ఒకే ఒక్క భార‌తీయుడు..!

బుమ్రా ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు సాధించాడు. ఈ క్ర‌మంలో ప‌లు రికార్డుల‌ను సాధించాడు.

Jasprit Bumrah records

Jasprit Bumrah records : కేప్‌టౌన్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచులో భార‌త్ ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ చారిత్ర‌త్మ‌క విజ‌యంలో భార‌త పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా త‌న వంతు పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల‌తో సౌతాఫ్రికా ప‌త‌నాన్ని శాసించాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లోనూ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మొత్తంగా బుమ్రా ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు సాధించాడు. ఈ క్ర‌మంలో ప‌లు రికార్డుల‌ను సాధించాడు.

కేప్‌టౌన్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా బుమ్రా ఘ‌న‌త సాధించాడు. ఈ మైదానంలో బుమ్రా 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు శ్రీనాథ్ పేరిట ఉండేది.

కేప్‌టౌన్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్లు వీరే..

జ‌స్‌ప్రీత్ బుమ్రా – 17* వికెట్లు
జ‌వ‌గ‌ళ్ శ్రీనాథ్ – 12 వికెట్లు
అనిల్ కుంబ్లే – 12 వికెట్లు

Virat Kohli : ద‌క్షిణాఫ్రికా పై చారిత్రాత్మ‌క విజ‌యం.. విరాట్ కోహ్లీ ‘భాంగ్రా’.. వీడియో వైర‌ల్‌

కేప్‌టౌన్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో షేన్‌వార్న్‌తో క‌లిసి సంయుక్తంగా బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. ఈ మైదానంలో బుమ్రా నేటి మ్యాచుతో క‌లిపి మూడు టెస్టులు ఆడాడు. 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆట‌గాడు కోలిన్ బ్లైత్ 25 వికెట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

కేప్‌టౌన్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

కోలిన్ బ్లైత్ (ఇంగ్లాండ్‌) – 25 వికెట్లు
జ‌స్‌ప్రీత్ బుమ్రా (భార‌త్‌) – 17* వికెట్లు
షేన్‌వార్న్ (ఆస్ట్రేలియా) – 17 వికెట్లు
జేమ్స్ అండ‌ర్స‌న్ (ఇంగ్లాండ్‌) – 16 వికెట్లు

టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో ద‌క్షిణాఫ్రికాలో అత్య‌ధిక టెస్టు వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో మూడో స్థానంలో బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో 45 వికెట్ల‌తో అనిల్ కుంబ్లే అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

ద‌క్షిణాఫ్రికాలో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

అనిల్ కుంబ్లే – 45 వికెట్లు
జ‌వ‌గ‌ళ్ శ్రీనాథ్ – 43 వికెట్లు
జ‌స్‌ప్రీత్ బుమ్రా – 38* వికెట్లు
మ‌హ్మ‌ద్ ష‌మీ – 35 వికెట్లు
జ‌హీర్ ఖాన్ -30 వికెట్లు

ICC : క్రికెట్‌లో ప‌లు నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించిన‌ ఐసీసీ.. పండ‌గ చేసుకుంటున్న బ్యాట‌ర్లు.. ఫీల్డింగ్ టీమ్‌కు క‌ష్ట‌కాల‌మే..!

ట్రెండింగ్ వార్తలు