ICC : క్రికెట్‌లో ప‌లు నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించిన‌ ఐసీసీ.. పండ‌గ చేసుకుంటున్న బ్యాట‌ర్లు.. ఫీల్డింగ్ టీమ్‌కు క‌ష్ట‌కాల‌మే..!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప‌లు నిబంధ‌న‌లను స‌వ‌రించింది.

ICC : క్రికెట్‌లో ప‌లు నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించిన‌ ఐసీసీ.. పండ‌గ చేసుకుంటున్న బ్యాట‌ర్లు.. ఫీల్డింగ్ టీమ్‌కు క‌ష్ట‌కాల‌మే..!

ICC changes stumping rule

ICC changes stumping rule : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప‌లు నిబంధ‌న‌లను స‌వ‌రించింది. దీంతో ప‌లు రూల్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నిబంధ‌న‌ల మార్పు బ్యాట‌ర్లకు వ‌రంలా మారింది. అదే స‌మ‌యంలో ఫీల్డింగ్ టీమ్‌కు న‌ష్టం చేకూరేలా ఉంది. ఈ నిబంధ‌న‌లు 2023 డిసెంబ‌ర్ 12 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు ఐసీసీ తెలిపింది. ఇంత‌కు ఐసీసీ స‌వ‌రించిన నిబంధ‌న‌లు ఏమిటో చూద్దాం..

స్టంపౌట్‌..

స్టంపౌట్ రూల్ విష‌యంలో ఐసీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి ఆన్‌ఫీల్డ్ అంపైర్లు స్టంపౌట్ విష‌యమై థ‌ర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేస్తే.. థ‌ర్డ్ అంపైర్ కేవ‌లం స్టంపౌట్ మాత్ర‌మే చెక్ చేసేలా నిబంధ‌న‌ను స‌వ‌రించారు. ఇంత‌క ముందు బ్యాట‌ర్ స్టంపౌట్ పై ఆన్‌ఫీల్డ్ అంపైర్లు థ‌ర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేస్తే.. ముందుగా బ్యాట‌ర్ క్యాచ్ ఔట్ అయ్యాడా లేదా అన్న‌ది చెక్ చేసేశాడు. ఒక‌వేళ బంతి బ్యాట్‌ను తాకితే క్యాచ్ ఔట్‌గా ఇచ్చేవారు. స్టంపౌట్‌ను చెక్ చేసేవారు కాదు.

Shortest Test match ever : టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో అతి త‌క్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్ ఏదో తెలుసా..?

ఒక‌వేళ బంతి బ్యాట్‌ను తాక‌కుంటే మాత్ర‌మే స్టంపౌట్ అయ్యాడా లేదా అన్న‌ది ప‌రిశీలించే వారు. ఇప్పుడు మాత్రం బంతి బ్యాట్‌ను తాకిందా లేదా అన్న దానితో సంబంధం లేకుండా నేరుగా స్టంపౌట్ మాత్ర‌మే చెక్‌చేయ‌నున్నారు. ఇది బ్యాట‌ర్ల‌కు లాభం చేకూర్చేదే.

కంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్ విష‌యంలోనూ..

కంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్ నిబంధ‌న‌ల‌లో కూడా మార్పులు చేసింది. ఎవ‌రైనా ప్లేయ‌ర్ కంక‌ష‌న్‌కు గురైతే ఆ ప్లేయ‌ర్ గ‌నుక అప్ప‌టికే బౌలింగ్‌లో నిషేదం ఎదుర్కొంటే అత‌డి స్థానంలో మైదానంలోకి అడుగుపెట్టే ఆట‌గాడు బౌలింగ్ చేసేందుకు అనుమ‌తి లేదు. అలాగే.. గ్లోబల్ గవర్నింగ్ బాడీ కూడా ఫీల్డ్ గాయం అంచనా, చికిత్స కోసం నిర్దేశించిన సమయాన్ని నాలుగు నిమిషాలకు పరిమితం చేసింది.

WTC Points table : ద‌క్షిణాఫ్రికా పై విజ‌యం.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మ‌ళ్లీ అగ్ర‌స్థానానికి చేరిన భార‌త్‌..