Rohit Sharma: రోహిత్ శర్మకు టీ20 వరల్డ్ కప్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారా? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ సెక్రటరీ జైషా

భారత్ వన్డే జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నారు. గత నెలలో జరిగిన వరల్డ్ కప్ లో రోహిత్ నాయకత్వంలోని టీమిండియా జట్టు ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది.

Rohit Sharma

BCCI Secretary Jay Shah : వచ్చే ఏడాది జూన్ – జులైలో టీ20 ప్రపంచ కప్ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో భారత్ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించారు. టీ20 ఫార్మాట్ లో రోహిత్ శర్మ 2022లో ఇంగ్లాండ్ తో చివరిగా మ్యాచ్ ఆడాడు. ఆ తరువాత ఈ ఫార్మాట్ లో రోహిత్ ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. మళ్లీ రోహిత్ టీ20 ఫార్మాట్లోకి పునరాగమనంపై జైషా కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : Gautam Gambhir : రోహిత్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేసిన గంభీర్.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశాడు

టీ20 ఫార్మాట్ లో రోహిత్ శర్మ పునరాగమనంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేనని జైషా చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. వచ్చే ఏడాది జూన్ లో టీ20 ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభమవుతుంది. మాకు అంతకంటే ముందు ఐపీఎల్, ఆఫ్గనిస్థాన్ తో సిరీస్ కూడా ఉందని జైషా చెప్పాడు. జైషా వ్యాఖ్యల ప్రకారం.. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మకు ఎలాంటి హామీ ఇవ్వలేనని ధృవీకరించినట్లు చెప్పొచ్చు.

Also Read : IND-W vs ENG-W 2nd T20 : భారత్ ఘోర ఓటమి.. రెండో టీ20లో ఇంగ్లాండ్ ఘ‌న విజ‌యం

భారత్ వన్డే జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నారు. గత నెలలో జరిగిన వరల్డ్ కప్ లో రోహిత్ నాయకత్వంలోని టీమిండియా జట్టు ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది. ఆ తరువాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్ లో రోహిత్ కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం సౌతాఫ్రికా సిరీస్ లోనూ రోహిత్ కు విశ్రాంతి ఇచ్చారు. అయితే, వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ జట్టు పగ్గాలు చేపడతాడని ప్రచారం జరుగుతున్నవేళ జైషా వ్యాఖ్యలు రోహిత్ అభిమానులకు ఇబ్బందికరంగా మారాయి.