Gautam Gambhir : రోహిత్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేసిన గంభీర్.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశాడు

ఒక ఆటగాడిని ఎందుకు తొలగించాలి? ఎందుకు ఎంచుకోవాలి అనేదానికి ప్రమాణం వయస్సు కాకూడదు. ఫామ్ మాత్రమే ప్రమాణంగా ఉండాలని గంభీర్ అన్నారు.

Gautam Gambhir : రోహిత్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేసిన గంభీర్.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశాడు

Gautam Gambhir, Rohit Sharma

Updated On : December 10, 2023 / 10:46 AM IST

Gautam Gambhir – Rohit Sharma : స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత్ జట్టు రోహిత్ శర్మ కెప్టెన్సీలో పాల్గొన్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా.. ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయి కప్ ను చేజార్చుకుంది. దీంతో పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు చేస్తుండగా.. మరికొందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. ద్ర‌విడ్ చెప్పాడు.. నేను చేయాల్సింది చేస్తా.. : రింకూ సింగ్

ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడారు.. రోహిత్ శర్మను ప్రశంసించాడు. వరల్డ్ కప్ లో భారత్ జట్టు ఆధిపత్యం చెలాయించిందని అన్నారు. కేవలం ఒక గేమ్ లో ఓడిపోయినంత మాత్రాన కెప్టెన్సీలో రోహిత్ వైఫల్యం చెందినట్లు కాదని అన్నారు. ఐదు ఐపీఎల్ టో్ప్రీలు గెలవడం అంత సులువుకాదు.. గత 50 ఓవర్ల ప్రపంచ కప్ లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించిన తీరు అద్భుతమని ప్రంపచ కప్ ఫైనల్ కు ముందు కూడా నేను చెప్పాను. ఫలితంతో సంబంధం లేకుండా వరల్డ్ కప్ తరువాత ఫలితం ఏమైనప్పటికీ భారత్ జట్టు ఛాంపియన్ లా ఆడింది. ఒక్క బ్యాడ్ గేమ్ తో రోహిత్ శర్మను, ఆ జట్టును చెడ్డ జట్టుగా మార్చదు. వరుసగా పది మ్యాచ్ లు గెలిచి ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన రోహిత్ శర్మ చెడ్డ కెప్టెన్ అనడం సరికాదని గంభీర్ అన్నారు.

Also Read : Abu Dhabi T10 League : టీ10 క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం.. మొద‌టి ఓవ‌ర్‌లోనే హ్యాట్రిక్.. 6 ప‌రుగులిచ్చి 5 వికెట్లు..

ఒక ఆటగాడిని ఎందుకు తొలగించాలి? ఎందుకు ఎంచుకోవాలి అనే ప్రమాణం వయస్సు కాకూడదు. ఫామ్ మాత్రమే ప్రమాణంగా ఉండాలని గంభీర్ అన్నారు. రిటైర్మెంట్ కూడా వ్యక్తిగత నిర్ణయం. ప్లేయర్ ను పదవీ విరమణ చేయమని ఎవరూ బలవంతం చేయలేరుని గంభీర్ అన్నారు. గత నెల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది. టోర్నీలో వరుసగా 10 మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా.. ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు చేస్తున్న వారికి గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.