IND vs WI : అవార్డులు, నగదు బహుమతులు అందుకున్న ప్లేయర్లు వీరే.. ఎవరికి ఎంతంటే..?
భారత్, వెస్టిండీస్ (IND vs WI ) జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ముగిసింది. రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపిక అయ్యాడు.

IND vs WI Test series List of award winners and prize money won
IND vs WI : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ పై భారత్ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
121 పరుగుల లక్ష్య ఛేదనలో 63/1తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ మరో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. టీమ్ఇండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (58 నాటౌట్) హాఫ్ సెంచరీ చేశాడు. సాయి సుదర్శన్ (39) రాణించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో (IND vs WI) ఎనిమిది వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. బ్యాట్, బాల్‌తో రాణించిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో జడేజా ఒకే ఒక సారి బ్యాటింగ్ చేశాడు. ఏకైక ఇన్నింగ్స్‌లో జడ్డూ 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక సిరీస్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.
రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున యశస్వి జైస్వాల్ (175)టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి గ్రేట్ స్ట్రైకర్స్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది, సాయి సుదర్శన్ ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో అతడికి క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అవార్డు, నగదు బహుమతుల జాబితా ఇదే..
* నితీశ్‌కుమార్ రెడ్డి – లాంగెస్ట్ సిక్స్ (89 మీటర్లు) – రూ. 1లక్ష
* షై హోప్ – ఉత్తమ వెస్టిండీస్ బ్యాటర్ – రూ. 1లక్ష
* యశస్వి జైస్వాల్ – గ్రేట్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ – రూ. 1లక్ష
* సాయి సుదర్శన్ – క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ – రూ. 1లక్ష
* కుల్దీప్ యాదవ్ – మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్- రూ. 1లక్ష
* రవీంద్ర జడేజా – మ్యాన్ ఆఫ్ ది సిరీస్ – రూ. 2.5లక్షలు