Good news to Team India fans
వన్డే ప్రపంచకప్‌లో ఓ పక్క భారత విజయాలను ఆస్వాదిస్తున్న క్రికెట్ అభిమానులకు జియో సినిమాస్ శుభవార్త చెప్పింది. వన్డే ప్రపంచకప్ ముగిసిన తరువాత టీమ్ఇండియా ఆడే సిరీస్‌లను ఉచితంగా చూడొచ్చునని తెలిపింది. మెగా టోర్నీ ముగిసిన తరువాత భారత జట్టు ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ లతో సిరీస్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లను జియో సినిమాలో ఫ్రీగా చూడొచ్చునని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. మెగాటోర్నీ ముగిసిన నాలుగు రోజులకే ఈ సిరీస్ ఆరంభం కానుంది. ఆసీస్‌తో సిరీస్ తరువాత అఫ్గానిస్థాన్, ఆ తరువాత ఇంగ్లాండ్‌లతో టీమ్ఇండియా సిరీస్‌లు ఆడనుంది. దీంతో ఐపీఎల్ వరకు కూడా టీమ్ఇండియా షెడ్యూల్ బిజీగా ఉంది. అఫ్గానిస్థాన్‌తో భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుండగా, ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను ఆడనుంది.
Virat Kohli : తనను ఔట్ చేసిన ఆటగాడికి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ.. ఏంటో తెలుసా..? వీడియో వైరల్
Don’t put away your blue jersey just yet, the season’s only getting started after the World Cup – at the new home of Indian cricket & it’s bigger than you’ve ever imagined!#INDvAUS, #INDvAFG & #INDvENG coming soon, LIVE on Sports18 & streaming FREE on JioCinema #JioCinemaSports pic.twitter.com/gr5t5bEQhI
— JioCinema (@JioCinema) November 13, 2023
కాగా.. జియో సినిమాస్ ఐపీఎల్ 2023 సీజన్‌ను ఫ్రీగా స్ట్రీమింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ సిరీస్‌లను ఫ్రీగానే చూడొచ్చునని చెప్పిన జియో సినిమాస్ ఐపీఎల్ 2024 విషయం పై ఇప్పటికైతే స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను డిస్నీ+హాట్ స్టార్ మొబైల్ యాప్‌లలో ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రపంచకప్ తరువాత టీమ్ఇండియా ఆడనున్న సిరీస్‌ల షెడ్యూల్ ఇదే..
– ఆస్ట్రేలియాతో.. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 03 వరకు ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్
– అఫ్గానిస్తాన్‌తో.. జనవరి 11 నుంచి 17 వరకు మూడు మ్యాచ్‌లు టీ20 సిరీస్
– ఇంగ్లాండ్‌తో.. జనవరి 25 నుంచి మార్చి 11 వరకు ఐదు టెస్టుల సిరీస్.
Kuldeep Yadav : న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్.. కుల్దీప్ యాదప్ కీలక వ్యాఖ్యలు