Jitesh Sharma comments after india lost semis against Bangladesh A in Asia Cup Rising Stars 2025
India A vs Bangladesh A : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో భారత ప్రయాణం ముగిసింది. సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ఇరు జట్ల స్కోర్లు సమం కాగా.. సూపర్ ఓవర్‌లో భారత్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. ఆతరువాత బౌలింగ్‌లో తొలి బంతికే వికెట్ తీసినప్పటికి వైడ్ వేసి బంగ్లాదేశ్‌కు విజయాన్ని కట్టబెట్టింది. దీంతో ఈ టోర్నీలో ఫైనల్ చేరకుండానే భారత్ నిష్ర్కమించింది.
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమికి సూపర్ ఓవరలో టీమ్‌మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలే కారణంగా కనబడుతోంది. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడిన వైభవ్ సూర్యవంశీ(38; 15 బంతులు 2 ఫోర్లు, 4 సిక్స్‌లు ), ప్రియాన్ష్ ఆర్య (44; 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) బదులుగా కెప్టెన్ జితేశ్ శర్మ, రమణ్‌దీప్ సింగ్, అశుతోష్ శర్మలను బ్యాటింగ్‌కు పంపించారు.
వైభవ్‌ను ఎందుకు పంపలేదు?
వైభవ్ సూర్యవంశీని ఎందుకు పంపలేదు అన్న విషయాన్ని మ్యాచ్ అనంతరం జితేశ్ శర్మ వివరించాడు. ‘పవర్ ప్లేలో వైభవ్, ప్రియాన్ష్ నిపుణులు అన్న సంగతి తెలుసు. కానీ డెత్ ఓవర్లలో నేను, అశుతోష్, రమన్ దీప్ లు బిగ్ హిట్టింగ్ ఆడగలం అని తెలుసు. అందుకే సూపర్ ఓవర్‌కు మేము బ్యాటింగ్‌కు వెళ్లాలని భావించాం. ఇది నా నిర్ణయమే కాదు జట్టు నిర్ణయం.’ అని జితేశ్ అన్నాడు.
Why did Jitesh Sharma and the coach not send Vaibhav Suryavanshi in the super over, when he was the only proper in form batsman in the Emerging Asia Cup final?#INDAvsBANA #Tejas #DubaiAirShow pic.twitter.com/Xr56NlSxv0
— Rebel_Warriors (@Rebel_Warriors) November 21, 2025
Smriti Mandhana : స్మృతి మంధానకు పలాష్ ముచ్చల్ సర్‌ప్రైజ్ ప్రపోజల్.. ప్రపంచకప్ గెలిచిన చోటే..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఆ తరువాత భారత్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 194 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
సూపర్ ఓవర్ జరిగింది ఇలా..
సూపర్ ఓవర్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి బంతికి జితేశ్ శర్మ, రెండో బంతికి అశుతోష్ లు ఔట్ అయ్యారు. దీంతో భారత్ సున్నా పరుగులు మాత్రమే చేసింది. ఆ తరువాత ఒక్క పరుగు లక్ష్యంతో బంగ్లా బ్యాటింగ్‌కు దిగింది. టీమ్ఇండియా బౌలర్ సుయాష్ శర్మ తొలి బంతికి బంగ్లా బ్యాటర్ యాసిర్ అలీని ఔట్ చేశాడు. అయితే.. రెండో బంతిని సుయాష్ వైడ్ వేశాడు. దీంతో బంగ్లా విజయం సాధించింది.