Smriti Mandhana : స్మృతి మంధానకు పలాష్ ముచ్చల్ సర్‌ప్రైజ్ ప్రపోజల్.. ప్రపంచకప్ గెలిచిన చోటే..
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana)త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది.
Palash Muchhal surprise proposal to Smriti Mandhana at World Cup final venue
Smriti Mandhana : భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది. మ్యూజిక్ కంపోజర్ అయిన పలాష్ ముచ్చల్‌తో ఏడుఅడుగులు వేయబోతుంది. కాగా.. తనకు కాబోయే భర్త నుంచి స్మృతి మంధాన (Smriti Mandhana ) సర్‌ప్రైజ్ ప్రపోజల్ అందుకుంది.
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. స్మృతికి ఎంతో మధుర జ్ఞాపకాన్ని ఇచ్చిన ఈ మైదానంలోనే పలాష్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమె అంగీకరించింది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
View this post on Instagram
ఇక ఈ వీడియోలో ఏముందంటే.. మొదటగా స్మృతి మంధాన కళ్లకు గంతలు కట్టి.. ఆమెను పలాష్ డీవై పాటిల్ స్టేడియంలోని పిచ్ వద్దకు తీసుకువచ్చాడు. ఆ తరువాత ఆమె కళ్లకు ఉన్న గంతలు తీశాడు. ఆ వెంటనే స్మృతి మంధాన ఎదురుగా మోకాలిపై కూర్చొని తన ప్రేమను వ్యక్తం చేశాడు. అనంతరం మంధాన అతడిని కౌగలించుకుంది. ఆ తరువాత ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తరువాత వారి స్నేహితులు కూడా మైదానంలోకి వచ్చారు. అందరూ కలిసి డ్యాన్స్ చేశారు.
Mitchell Starc : మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత.. అశ్విన్ ను అధిగమించి ఎలైట్ లిస్ట్‌లో చోటు..
పలాష్ ముచ్చల్, స్మృతి మంధానల పెళ్లి నవంబర్ 23న జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి పెళ్లికి ఏర్పాట్లు మొదలైనట్లు తెలుస్తోంది.
