Palash Muchhal surprise proposal to Smriti Mandhana at World Cup final venue
Smriti Mandhana : భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది. మ్యూజిక్ కంపోజర్ అయిన పలాష్ ముచ్చల్‌తో ఏడుఅడుగులు వేయబోతుంది. కాగా.. తనకు కాబోయే భర్త నుంచి స్మృతి మంధాన (Smriti Mandhana ) సర్‌ప్రైజ్ ప్రపోజల్ అందుకుంది.
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. స్మృతికి ఎంతో మధుర జ్ఞాపకాన్ని ఇచ్చిన ఈ మైదానంలోనే పలాష్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమె అంగీకరించింది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
ఇక ఈ వీడియోలో ఏముందంటే.. మొదటగా స్మృతి మంధాన కళ్లకు గంతలు కట్టి.. ఆమెను పలాష్ డీవై పాటిల్ స్టేడియంలోని పిచ్ వద్దకు తీసుకువచ్చాడు. ఆ తరువాత ఆమె కళ్లకు ఉన్న గంతలు తీశాడు. ఆ వెంటనే స్మృతి మంధాన ఎదురుగా మోకాలిపై కూర్చొని తన ప్రేమను వ్యక్తం చేశాడు. అనంతరం మంధాన అతడిని కౌగలించుకుంది. ఆ తరువాత ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తరువాత వారి స్నేహితులు కూడా మైదానంలోకి వచ్చారు. అందరూ కలిసి డ్యాన్స్ చేశారు.
Mitchell Starc : మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత.. అశ్విన్ ను అధిగమించి ఎలైట్ లిస్ట్‌లో చోటు..
పలాష్ ముచ్చల్, స్మృతి మంధానల పెళ్లి నవంబర్ 23న జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి పెళ్లికి ఏర్పాట్లు మొదలైనట్లు తెలుస్తోంది.