Joe Root : చ‌రిత్ర సృష్టించిన జోరూట్‌.. భార‌త్‌పై టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు..

ఇంగ్లాండ్ స్టార్ బ్యాట‌ర్ జోరూట్ ఫామ్ అందుకున్నాడు.

Joe Root Creates History Becomes Batter With Most Test Century Against India

ఇంగ్లాండ్ స్టార్ బ్యాట‌ర్ జోరూట్ ఫామ్ అందుకున్నాడు. భార‌త్‌తో జ‌రుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బ్యాటింగ్‌లో విఫ‌లం అవుతూ వ‌స్తున్న రూట్‌.. కీల‌క‌మైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో సెంచ‌రీతో స‌త్తా చాటాడు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికీ త‌న స‌హ‌జ‌శైలిలో బ్యాటింగ్ కొన‌సాగించిన అత‌డు ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 219 బంతుల్లో 9 ఫోర్ల‌తో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రూట్‌కు ఇది 31వ సెంచ‌రీ కావ‌డం విశేషం.

తాజా శ‌త‌కంతో రూట్ ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో టీమ్ఇండియా పై అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. భార‌త్ పై రూట్‌కి ఇది ప‌దో శ‌త‌కం. ఈ క్ర‌మంలో అత‌డు స్టీవ్ స్మిత్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. స్మిత్ ఇండియాపై 9 సెంచ‌రీలు చేశాడు.

టెస్టుల్లో భారత్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆట‌గాళ్లు..

జో రూట్ (ఇంగ్లాండ్‌) – 52 ఇన్నింగ్స్‌ల్లో – 10 సెంచ‌రీలు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 37 ఇన్నింగ్స్‌ల్లో- 9
గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్‌) – 30 ఇన్నింగ్స్‌ల్లో – 8
వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్‌) – 41 ఇన్నింగ్స్‌ల్లో – 8
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 51 ఇన్నింగ్స్‌ల్లో – 8

Shreyas Iyer : ప్ర‌మాదంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌ల సెంట్ర‌ల్ కాంట్రాక్టులు

ఇక భార‌త్ పై అన్ని ఫార్మాట్ల‌లో రూట్‌కు ఇది 13వ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు స్టీవ్ స్మిత్, రికీ పాంటింగ్‌లు మాత్ర‌మే భార‌త్ పై అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో 14 శ‌త‌కాల‌తో మొద‌టి స్థానంలో ఉన్నారు.

స్లోయెస్ట్ సెంచ‌రీ..

జోరూట్ త‌న టెస్టు కెరీర్‌లో మొత్తం 31 సెంచ‌రీలు చేశాడు. ఇందులో స్లోయెస్ట్ సెంచ‌రీల జాబితాలో తాజా శ‌త‌కం మూడోది. హామిల్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రూట్ 259 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. ఇదే అత‌డి కెరీర్‌లో అత్య‌ధిక బంతులు తీసుకున్న సెంచ‌రీ

IND vs ENG : ఇంగ్లాండ్‌కు వ‌రుస షాక్‌లు.. స్వ‌దేశానికి ప‌య‌న‌మైన‌ యువ‌ స్పిన్న‌ర్‌.. ఐదో టెస్టుకు దూరం

న్యూజిలాండ్ పై హామిల్ట‌న్‌లో 2019లో – 259 బంతులు
ఆస్ట్రేలియా పై లార్డ్స్‌లో 2013 లో – 247
భార‌త్ పై రాంచీలో 2024లో – 219
భార‌త్ పై లార్డ్స్‌లో 2021లో – 200
వెస్టిండీస్ పై బ్రిడ్జ్‌టౌన్‌లో 2022లో – 199

ట్రెండింగ్ వార్తలు