ప్ర‌మాదంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌ల సెంట్ర‌ల్ కాంట్రాక్టులు

టీమ్ఇండియా యువ ఆట‌గాళ్లు శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌ల‌కు బీసీసీఐ షాక్ ఇవ్వ‌నుందా అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

ప్ర‌మాదంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌ల సెంట్ర‌ల్ కాంట్రాక్టులు

Iyer and Kishan set to lose central contracts for not playing domestic cricket Report

Shreyas Iyer – Ishan Kishan : టీమ్ఇండియా యువ ఆట‌గాళ్లు శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌ల‌కు బీసీసీఐ షాక్ ఇవ్వ‌నుందా అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రంజీట్రోఫీకి దూరంగా ఉండ‌డంతో ఈ ఇద్ద‌రు యువ ఆట‌గాళ్ల పై చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి వీరి పేర్ల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

బీసీసీఐ ఇస్తున్న సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ 2023లో శ్రేయ‌స్ అయ్య‌ర్ గ్రేడ్ బిలో ఉండ‌గా ఇషాన్ కిష‌న్ గ్రేడ్ సిలో ఉన్నారు. ఈక్ర‌మంలో శ్రేయ‌స్ రూ.3 కోట్ల వార్షిక వేత‌నాన్ని పొందుతుండ‌గా ఇషాన్ కోటి జీతం అందుకుంటున్నాడు. బోర్డు ఆదేశాల‌ను వీరిద్ద‌రు బేఖార‌తు చేస్తూ రంజీల్లో ముంబైకి అయ్య‌ర్‌, జార్ఖండ్‌కు కిష‌న్ అందుబాటులో ఉండ‌డం లేదు. అతి త్వ‌ర‌లోనే బీసీసీఐ 2024కు సంబంధించిన కాంట్రాక్ట్స్‌ల‌ను ప్ర‌కటించ‌నుంది. ఇందులో ఈ ఇద్ద‌రికి స్థానం ఇవ్వొద్ద‌ని బీసీసీఐ పెద్ద‌లు భావిస్తున్న‌ట్లుగా ఆంగ్ల మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే.. మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న నుంచి ఇషాన్ కిష‌న్ అర్థాంత‌రంగా త‌ప్పుకోగా ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో విఫ‌లం కావ‌డంతో సెల‌క్ట‌ర్లు అయ్య‌ర్ పై వేటు వేశారు. దీంతో అయ్య‌ర్ వెన్ను నొప్పి అంటూ రంజీకి దూరంగా ఉన్నాడు. అయితే.. అయ్య‌ర్‌కు ఎలాంటి ఫిట్‌నెస్ స‌మ‌స్య లేద‌ని ఎన్‌సీఏ అధికారులు ఇప్ప‌టికే బీసీసీఐకి నివేదిక ఇచ్చారు. అటు మాన‌సిక స‌మ‌స్య అంటూ చెబుతున్న ఇష‌న్‌.. హార్దిక్ పాండ్య‌, కృనాల్ పాండ్య‌ల‌తో క‌లిసి ఐపీఎల్ ప్రిప‌రేష‌న్స్ మొద‌లుపెట్టాడు.

Also Read : ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అత‌డే.. చిన్న‌ట్విస్ట్ కూడా ఉందిగా!

ఎలాంటి ఫిట్‌నెస్ స‌మ‌స్య‌లు లేని ఆట‌గాళ్ల‌తో పాటు జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉన్న ప్లేయ‌ర్లు అంద‌రూ దేశ‌వాళీ క్రికెట్‌ను ఆడాల‌ని స్వ‌యంగా బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా లేఖ‌లు రాశారు. అయిన‌ప్ప‌టికీ ఈ ఆదేశాల‌ను ఇషాన్‌, అయ్య‌ర్‌లు ప‌ట్టించుకోలేదు.

Also Read: ఇంగ్లాండ్‌కు వ‌రుస షాక్‌లు.. స్వ‌దేశానికి ప‌య‌న‌మైన‌ యువ‌ స్పిన్న‌ర్‌.. ఐదో టెస్టుకు దూరం