Kane Williamson : అంత గుడ్డి న‌మ్మ‌కం ప‌నికి రాదు మామ‌.. ఇప్పుడు చూడు ఏమైందో..? సిగ్గుతో త‌ల‌దించుకుంటివి..!

Kane Williamson Covering His Face :క్రికెట్ చరిత్ర‌లోనే అత్యంత చెత్త రివ్యూ ను న్యూజిలాండ్ టీమ్ తీసుకుంది. తాము చేసిన త‌ప్పిదాన్ని చూసిన త‌రువాత కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ సిగ్గుతో త‌ల‌దించుకున్నాడు.

Kane Williamson

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో సెమీస్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజ‌యం సాధించింది. బెంగ‌ళూరు వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో కివీస్ సెమీస్ అవ‌కాశాలు మ‌రింత మెరుగు అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. క్రికెట్ చరిత్ర‌లోనే అత్యంత చెత్త రివ్యూ ను న్యూజిలాండ్ టీమ్ తీసుకుంది. తాము చేసిన త‌ప్పిదాన్ని చూసిన త‌రువాత కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ సిగ్గుతో త‌ల‌దించుకున్నాడు.

శ్రీలంక ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 24వ ఓవ‌ర్ ను ఫెర్గూస‌న్ వేశాడు. నాలుగో బంతిని వేయ‌గా బ్యాట‌ర్ చ‌మీరా షాట్ ఆడ‌గా ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి అత‌డి ప్యాడ్ల‌ను తాకింది. కివీస్ ఆట‌గాళ్లు అప్పీల్ చేయ‌గా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే.. ఫ‌స్ట్ స్లిప్‌లో ఉన్న డారిల్ మిచెల్ రివ్యూ తీసుకోవాల‌ని సూచించ‌గా అత‌డి పై ఉన్న న‌మ్మ‌కంతో విలియ‌మ్స‌న్ రివ్యూ తీసుకున్నాడు.

Babar Azam : బాబ‌ర్ ఆజాంకు కోప‌మొచ్చింది..! టీవీల ముందు మాట్లాడ‌డం ఈజీ..

రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకడం చాలా స్ప‌ష్టంగా క‌నిపించింది. దీన్ని చూసిన కివీస్ ఆట‌గాళ్లు న‌వ్వుకున్నారు. విలియ‌మ్స‌న్ మాత్రం న‌వ్వును ఆపుకుంటూ ముఖం పై చేతిని ఉంచుకుని సిగ్గుతో త‌ల‌దించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రివ్యూ ఆఫ్ ది టోర్నీ అని పేర్కొంటూ ఐసీసీ పోస్ట్ చేసింది. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

FACT CHECK : స‌చిన్ టెండూల్క‌ర్ కాళ్లు మొక్కిన మాక్స్‌వెల్‌..? ఆ విధ్వంస‌క‌ర డబుల్ సెంచ‌రీ త‌రువాత‌..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ ఫెరీరా (51) హాఫ్ సెంచ‌రీతో రాణించగా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. లాకీ ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ లు త‌లా రెండేసి వికెట్లు తీశారు. టిమ్ సౌతీ ఒక వికెట్ ను ద‌క్కించుకున్నాడు. ల‌క్ష్యాన్ని కివీస్ 23.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డెవాన్ కాన్వే 45, డారిల్ మిచెల్ 43, రచిన్ రవీంద్ర 42 ప‌రుగులు చేశారు.

ట్రెండింగ్ వార్తలు