×
Ad

Kane Williamson : ల‌క్నో జ‌ట్టులోకి కేన్ విలియ‌మ్స‌న్‌.. అయితే ఆట‌గాడిగా మాత్రం కాదండోయ్‌.. గొయెంకా మామూలోడు కాదుగా

న్యూజిలాండ్ స్టార్ ఆట‌గాడు కేన్ విలియ‌మ్స‌న్ ను (Kane Williamson) ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టులో చేర్చుకుంది.

Kane Williamson Joins Lucknow Super Giants Ahead Of IPL 2026

Kane Williamson : ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిరాశ ప‌రిచింది. 14 మ్యాచ్‌లు ఆడగా 6 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మొత్తంగా ఏడో స్థానంతో సీజ‌న్‌ను ముగించింది. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ 2026లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే కృత‌నిశ్చ‌యంతో ల‌క్నో ఫ్రాంఛైజీ ఉంది. ఈ క్ర‌మంలో గ‌త సీజ‌న్‌లో జ‌ట్టుకు మెంటార్‌గా వ్య‌వ‌హ‌రించిన జ‌హీర్ ఖాన్‌ను త‌ప్పించిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా న్యూజిలాండ్ స్టార్ ఆట‌గాడు కేన్ విలియ‌మ్స‌న్ ను జ‌ట్టులో చేర్చుకుంది. అయితే.. ఆట‌గాడిగా మాత్రం కాదండోయ్‌. వ్యూహాత్మక సలహాదారుగా (స్ట్రాటజిక్ అడ్వైజర్‌)గా కోచింగ్ బృందంలోకి తీసుకుంది. ఈ విష‌యాన్ని ల‌క్నో ఫ్రాంఛైజీ ఓన‌ర్ సంజీవ్ గొయెంకా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు.

Virat Kohli : వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ వార్త‌ల వేళ‌.. విరాట్ కోహ్లీ పోస్టు వైర‌ల్..

ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏమిటంటే.. ఈ ఏడాది SA20లో ల‌క్నో సోదరి ఫ్రాంచైజీ అయిన డర్బన్స్ సూపర్ జెయింట్స్‌లో కూడా విలియ‌మ్స‌న్ భాగం అయ్యాడు.

‘సూప‌ర్ జెయింట్స్ కుటుంబంలో భాగంగా ఉన్న కేన్ ఐపీఎల్‌లో ల‌క్నో జ‌ట్టు వ్యూహాత్మక సలహాదారుగా నియ‌మితుల‌య్యాడు. అతని నాయకత్వం, వ్యూహాత్మక అంతర్దృష్టి, ఆటపై లోతైన అవగాహన, ఆటగాళ్లను ప్రేరేపించే సామర్థ్యం జట్టుకు ఎంతో మేలు చేస్తాయి.’ అని గోయెంకా ట్వీట్ చేశారు.

క్యాజువ‌ల్ కాంట్రాక్ట్‌లో..

విలియమ్సన్ ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు క్యాజువల్ కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. బ్లాక్‌క్యాప్స్ తరపున అతను ఇటీవల 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అక్కడ ఆ జట్టు భారతదేశం చేతిలో ఓడిపోయింది.

Rohit Sharma : ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌.. రోహిత్ శర్మ‌ను ఊరిస్తున్న 8 భారీ రికార్డులు.. 50 శ‌త‌కాలు, 500 మ్యాచ్‌లు ఇంకా..

ఇక ఐపీఎల్ విష‌యానికి వ‌స్తే.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, గుజరాత్ టైటాన్స్ త‌రుపున మొత్తం 79 మ్యాచ్‌లు ఆడాడు. 35.46 స‌గ‌టుతో 125.61 స్ట్రైక్‌రేటుతో 2,128 ప‌రుగులు చేశాడు. 2018 సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు. ఆ సీజ‌న్‌లో 17 మ్యాచ్‌ల్లో 735 ప‌రుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలాడు.