కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి ఔట్.. ఎందుకంటే?

న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

Kane Williamson

Newzealand Captain Williamson : టీ20 ప్రపంచ కప్ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటికే లీగ్ మ్యాచ్ లు ముగిశాయి. సూపర్ -8 మ్యాచ్ లో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సూపర్-8కు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్టు అర్హత సాధించాయి. పెద్ద జట్లలో ఒకటైన న్యూజిలాండ్ జట్టు లీగ్ దశలోనే ఇంటిదారిపట్టింది.

Also Read: T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ క‌ల‌క‌లం..!

టోర్నీలో గ్రూప్-సీలో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు పేలువ ప్రదర్శన కనబర్చింది. దీంతో రెండు విజయాలు (ఉగాండా, పాపువా న్యూగిని జట్లుపై), రెండు ఓటములతో (ఆఫ్గానిస్థాన్, వెస్టిండీస్ జట్లుపై) లీగ్ దశలోనే నిష్క్రమించింది. న్యూజిలాండ్ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీ20, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 2024 -25 సెంట్రల్ కాంట్రాక్టును కూడా విలియమ్సన్ రద్దు చేసుకున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక వెబ్ సైట్ లో ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, జాతీయ కాంట్రాక్ట్ ను తిరస్కరించినప్పటికీ ఆటగాడిగా జట్టుకు అందుబాటులో ఉంటాడని జట్టు యాజమాన్యం తెలిపింది.

Also Read : Babar Azam : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న.. ఇప్ప‌ట్లో పాక్‌కు వెళ్ల‌నంటున్న బాబ‌ర్ ఆజాం.. అత‌డిబాట‌లోనే మ‌రో ఐదుగురు ప్లేయ‌ర్లు..!

విలియమ్సన్ మాట్లాడుతూ.. తాను అంతర్జాతీయ క్రికెట్ కు దూరమవుతున్నానని భావించకూడదని, భవిష్యత్తులో సెంట్రల్ కాంట్రాక్ట్ ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. న్యూజిలాండ్ వేసవి సమయంలో జట్టు చాలా తక్కువ మ్యాచ్ లు ఆడనుంది. దీంతో విదేశాల్లో ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ ఆఫర్ ను తిరస్కరించానని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన ప్రకటనలో విలియమ్సన్ పేర్కొన్నాడు.