Kane Williamson to miss third India Test as well
IND vs NZ : మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత గడ్డ పై టెస్టు సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు కేన్ విలిమయ్సన్ మూడో టెస్టుకు దూరం అయ్యాడు. శ్రీలంక పర్యటనలోనే కేన్ మామ గాయపడ్డాడు. స్వదేశానికి వెళ్లిన విలియమ్సన్ అక్కడ కోలుకుంటున్నారు. భారత్‌తో సిరీస్ నాటికి గాయం తగ్గుతుందని భావించి అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు.
అయితే.. గాయం తీవ్రత తగ్గకపోవడంతో అతడు భారత్‌కు రాలేదు. రెండో టెస్టుకు అందుబాటులో వస్తాడు అనుకుంటే అది జరగలేదు. మూడో టెస్టుకు ఖచ్చితంగా వస్తాడని సెలక్టర్లు చెప్పారు. అయితే.. ఇప్పటికే కివీస్ సిరీస్ గెలిచి జోష్‌లో ఉంది. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ దృష్ట్యా విలియమ్సన్ ను భారత్‌తో మూడో టెస్టుకు దూరంగా ఉంచినట్లు కివీస్ మేనేజ్‌మెంట్ చెప్పింది.
ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఇంకా నెల మాత్రమే సమయం ఉంది. కేన్ విలియమ్సన్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇంగ్లాండ్ సిరీస్ నాటికి అతడు జట్టుతో చేరుతాడు. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగే తొలి టెస్టులో అతడు ఆడుతాడు. అని హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు.
కాగా.. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Virat Kohli : స్పిన్ ఆడడంలో తడబడుతున్న కోహ్లీ.. దినేశ్ కార్తీక్ సలహా..