Virat Kohli : స్పిన్ ఆడడంలో తడబడుతున్న కోహ్లీ.. దినేశ్ కార్తీక్ సలహా..
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.

Virat Kohli should play domestic cricket Dinesh Karthik
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. స్వదేశంలో టీమ్ఇండియాకు ఇది ఊహించని పరాభవం. రెండో టెస్టులో న్యూజిలాండ్ చేతిలో ఓటమి భారత డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. కాగా.. కివీస్ చేతిలో టెస్టు సిరీస్ ఓటమికి బ్యాటర్ల వైఫల్యమే కారణం క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉందంటున్నారు.
ఇక పేలవ ఫామ్‌తో సతమతం అవుతూ స్పిన్ ఆడడంలో తడబడుతున్నాడు కోహ్లీ. ఈ క్రమంలో కోహ్లీకి టీమ్ఇండియా మాజీ ఆటగాడు దినేశ్ కార్తీక్ పలు సూచనలు చేశాడు. టెస్టుల్లో కోహ్లీ ఫామ్‌ను అందుకోవాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు.
కివీస్‌తో ఆడిన రెండు టెస్టుల్లో.. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ బ్యాటింగ్ కు దిగాడు. ఇందులో మూడు సార్లు అతడు ఔటైన తీరు సంతృప్తికరంగా లేదు. దీనిపై అతడు చాలా తీవ్రంగా నిరాశ చెంది ఉంటాడు అని కార్తీక్ తెలిపాడు. స్పిన్నర్లు అతడిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారన్నాడు. అతడు ఓ సూపర్ స్టార్ అని, త్వరలోనే అతడు దీన్ని నుంచి బయటకు వస్తాడని కార్తీక్ చెప్పాడు.
కోహ్లీ సత్తా ఏమిటో మనందరికీ తెలుసు. ఈ సిరీస్ ఫలితం అతనేంటో నిర్థారించలేదు. అభిమానులు చెబుతున్నట్లుగా.. గతకొంతకాలంగా అతడు అంచనాలను అందుకోలేకపోతున్నాడు. గత రెండు మూడేళ్లలో స్పిన్ కు వ్యతిరేకంగా అతడి రికార్డు ఏమి గొప్పగా లేదు. అతడు దేశవాళీ క్రికెట్ పై ఫోకస్ చేయాలి. అక్కడ ఆడి ఫామ్‌ను అందుకోవాలి అని కార్తీక్ అన్నాడు.
Gary Kirsten : పాకిస్థాన్‌కో దండంరా అయ్యా.. కోచ్ పదవికి కిర్‌స్టన్ రాజీనామా..
2021 నుంచి ఆసియాలో కోహ్లీ 27 ఇన్నింగ్స్‌లు ఆడితే అందులో 22 సార్లు అతడు స్పిన్‌లోనే ఔట్ అయ్యాడు. ఇందులో ఎడమచేతివాటం స్పిన్నర్ల చేతిలో 11 సార్లు ఔట్ అయ్యారు.