టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడొద్దని వాళ్లను వరల్డ్ కప్ నుంచి వెలివేయాలని వాదిస్తుంటే క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్‌లు మాత్రం మ్యాచ్ ఉండాల్సిందే. పాక్‌ను మనోళ్లు చిత్తుగా ఓడించాల్సిందేనంటూ హాట్ కామెంట్లు చేస్తున్నారు.
Read Also: భారత్ Vs పాక్ మ్యాచ్: బీసీసీఐ చెప్పిందే చేస్తామంటోన్న కోహ్లీ
శుక్రవారం పుణెలో ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన భారత్-పాక్ మ్యాచ్‌పై ఇలా స్పందించాడు. ‘ఆడాలి ఆడకపోవడమనేది ప్రభుత్వ నిర్ణయం. ప్రజలు నిర్ణయించాల్సింది కాదు. దీని గురించి నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి వదిలేయడమే మంచిది. ప్రభుత్వం ఏది చెప్తే అది చేసేందుకు సిద్ధంగా ఉండడమే మన కర్తవ్యం’ అని స్పష్టం చేశారు.
ఇప్పటికే సర్వత్రా పాక్‌తో మ్యాచ్ ఆడొద్దని విమర్శలు వ్యక్తమవుతోన్న క్రమంలో బీసీసీఐ.. సీఓఏతో చర్చలు జరిపింది. ఐసీసీకి తాము స్వయంగా లేఖ రాసి పాక్‌తో మ్యాచ్ రద్దు చేయమని విజ్ఞప్తి చేస్తామని తెలిపింది.
Read Also: తేజస్ యుద్ధ విమానంలో పీవి సింధు