Kashmir willow bats
English Willow Bats: ఇండియాలో 2023 చివరిలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. పన్నెండేళ్ల తరువాత ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఇండియా ఆతిధ్యమిస్తుంది. అయితే, వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లకు తొలిసారి జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో తయారు చేసే కశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్లను ఎక్కువగా వినియోగించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ బ్యాట్లను వినియోగించేందుకు క్రికెటర్లు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా క్రికెటర్లు ఇంగ్లీష్ విల్లో బ్యాట్లను వినియోగిస్తారు. తాజాగా కశ్మీర్ విల్లో బ్యాట్లనూ వినియోగించేందుకు క్రికెటర్లు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఓ కారణం ఉంది.
గత రెండు సంవత్సరాలుగా కశ్మీర్ విల్లో బ్యాట్లకు ఆదరణ పెరుగుతోంది. అయితే, గత టీ20 ప్రపంచ కప్ తరువాత ఈ బ్యాట్లకు క్రేజ్ పెరిగింది. ఈ టోర్నీలో బ్యాటర్ కశ్మీర్ విల్లో బ్యాట్‌తో అత్యంత లాంగ్ సిక్స్ కొట్టాడు. దీంతో అప్పటి నుంచి ఈ బ్యాట్లకు డిమాండ్ పెరిగింది. ఈ విషయంపై కశ్మీర్ క్రికెట్ బ్యాట్ తయారీ సంఘం అధ్యక్షుడు ఫయాజ్ అహ్మద్ దార్ మాట్లాడుతూ.. 50ఓవర్ల క్రికెట్ ప్రపంచ కప్‌లో కశ్మీర్ విల్లోతో తయారు చేసిన బ్యాట్‌లను కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు ఎంచుకోవటం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఇంగ్లీష్ విల్లో బ్యాట్లను మాత్రమే వినియోగించేవారు. గత రెండు సంవత్సరాలుగా కశ్మీర్ విల్లో బ్యాట్లకు డిమాండ్ పెరిగిందని తెలిపారు.
James Anderson : జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. 1100 వికెట్ల క్లబ్‌లో చేరిక
ఇటీవల భారత్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లకు కశ్మీర్ విల్లో బ్యాట్లను సరఫరా చేశామని ఫయాజ్ అహ్మద్ తెలిపారు. గత రెండు టీ20 ప్రపంచ కప్ లలో కొంత మంది ఆటగాళ్లు ఈ బ్యాట్లను వినియోగించారు. తాజాగా 50 ఓవర్ల ప్రపంచ కప్‌లో తొలిసారి ఈ బ్యాట్లను వినియోగిస్తున్నారు. గతంలో కశ్మీర్ విల్లో బ్యాట్లను వన్డే వరల్డ్‌కప్‌లో వినియోగించలేదు. ఈసారి ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్, యుఏఈ, ఇతర దేశాల ఆటగాళ్లు వచ్చే వరల్డ్ కప్‌లో కశ్మీర్ విల్లో బ్యాట్లను ఉపయోగించనున్నారు.
India tour of West Indies : వెస్టిండీస్ కష్టాలు.. టెస్టు సిరీస్‌ను రీ షెడ్యూల్ చేస్తారా..?
ఇంగ్లీష్ విల్లో బ్యాట్ల ధరతో పోలిస్తే కశ్మీర్ విల్లో బ్యాట్ల ధర తక్కువ. దీనికితోడు నాణ్యతలోనూ ఉత్తమంగా ఉంటాయి. కశ్మీర్ విల్లో బ్యాట్లు ఒక్కొక్కటి రూ. 10వేల నుంచి 12వేల వరకు ఉంటుంది. ఇంగ్లీష్ విల్లో బ్యాట్ల ధర రూ. లక్ష వరకు కూడా ఉంటాయి. ఈ ఏడాది చివరిలో వన్డే వరల్డ్ కప్ లో కశ్మీర్ విల్లో బ్యాట్లను తొలిసారి వినియోగించనున్న నేపథ్యంలో వీటికి క్రేజ్ పెరిగింది. దీంతో దక్షిణ కశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా బిజ్ బెహరా, చార్సూ, సేతార్ సంగం, హల్ములా, సంగం, పుజ్‌టెంగ్, జలంధర్ తో పాటు యూపీలోని మీరట్ ప్రాంతాల్లో కూడా విల్లో బ్యాట్ల పరిశ్రమలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.